నకిలీ ఐ.డి గుర్తింపు కార్డులతో అనుమతి లేని ఆర్మీ ప్రాంతం లోకి నలుగురు వ్యక్తుల చొరబాటు. అదుపులోకి తీసుకున్న తిరుమలగిరి పోలీస్ లు.

0
1K

సికింద్రాబాద్.. తిరుమలగిరిలో ఆర్మీ అధీనంలో ఉన్న ప్రాంతంలోకి అక్రమంగా చొరబడిన నలుగురు వ్యక్తులను తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేశారు.తిరుమలగిరిలోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ (MCEME) కళాశాల టెక్నో చౌక్‌ గేటులోకి అనుమతి లేకుండా నకిలీ వైమానికదళ అధికారి గుర్తింపు కార్డులతో ఎయిర్ ఫోర్సు దుస్తులను లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా ఆర్మీ రహస్య ప్రాంతంలో ఫోటోలు, వీడియోలు చిత్రీకరిస్తుండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ అధికారులు వారిని ప్రశ్నించారు. ఆర్మీ ప్రాంతంలోని కీలక సమాచారంపై ఫోటోలు, వీడియోలు తీసుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం కావడంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారులు అన్ని కోణాలలో విచారించి తిరుమలగిరి పోలీసులకు అప్పగించారు.లెఫ్టినెంట్ కల్నల్ ఫిర్యాదుతో తిరుమలగిరి పీఎస్‌లో కేసు నమోదు అయింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని పేరుతో వాళ్లు లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ మరి ఏదైనా జాతీయ భద్రత అంశం సంబంధించిన కోణం లో కూడా దర్యాప్తు జరుపుతున్నారు.అనుమానాస్పదంగా తిరుగుతూ ఫోటోలు వీడియోలు తీసుకున్న నలుగురు వ్యక్తులను (ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు) రాకేష్ కుమార్, ఆశిష్ కుమార్, ఆలియా అబ్షీ, నగ్మభానూ లు పోలీసుల విచారణలో ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Funds for Barrage | బ్యారేజ్‌కి నిధుల మంజూరు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకాశం బ్యారేజ్‌ మరమ్మత్తులకు నిధులు మంజూరు చేసింది....
By Rahul Pashikanti 2025-09-11 10:59:04 0 25
BMA
"Break Their Legs" Order Raises Serious Concerns Over Police Brutality in Bhubaneswar
On June 29, 2025, Additional Commissioner of Bhubaneswar was caught on camera instructing...
By Citizen Rights Council 2025-06-30 08:54:59 0 2K
Bharat Aawaz
రాజకీయ వ్యభిచారం ⭐ Right To Recall
https://youtu.be/WgtnvQrJPPM
By Hazu MD. 2025-08-19 09:24:05 0 545
Andhra Pradesh
TTD Improves Annaprasadam Supply | టీటీడీ అన్నప్రసాద సరఫరా మెరుగ్గా
తిరుమల తిరుపతి దేవస్థానం (#TTD) అన్నప్రసాదం కోసం కూరగాయల దానాలను మరింత సులభతరం చేయడానికి ప్రత్యేక...
By Rahul Pashikanti 2025-09-10 09:06:00 0 25
Andhra Pradesh
CPI (Maoist) Member Surrenders | సిపిఐ (మావోయిస్ట్) సభ్యుడు సమర్పణ
ASR పోలీస్ స్టేషన్‌లో CPI (మావోయిస్ట్) జిల్లా కమిటీ సభ్యుడు స్వచ్ఛందంగా సమర్పణ అయ్యాడు....
By Rahul Pashikanti 2025-09-10 11:03:37 0 34
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com