ఇంటింటికీ టీడీపీ.. 70 లక్షల ఇళ్లకు చేరువగా కార్యక్రమం.

0
117

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఇంటింటికీ తెలుగుదేశం - రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం' కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహభరితంగా సాగుతోంది. ఈ కార్యక్రమం ప్రారంభమైన 24 రోజుల్లో పార్టీ శ్రేణులు మొత్తం 69.26 లక్షల కుటుంబాలను నేరుగా కలిశారు. బుధవారం 24వ రోజున తాజాగా మరో 2.54 లక్షల ఇళ్లను సందర్శించారు.

 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించడంతో పాటు క్షేత్రస్థాయిలో వారి అభిప్రాయాలను సేకరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంటింటి పర్యటనలో భాగంగా ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజలకు వివరిస్తూనే, వారు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలపై ఆరా తీస్తున్నారు.

 

ప్రజల నుంచి వస్తున్న సూచనలు, సలహాలను పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ, వాటిని స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, వారి అవసరాలను గుర్తించే పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.

Search
Categories
Read More
Telangana
Central election commission gives green signal for kavitha new party
“తెలంగాణ రక్షణ సేన”కు సీఈసీ గ్రీన్ సిగ్నల్.. కవితకు అధికారిక అనుమతి   కేంద్ర...
By G k Nookala 2026-04-30 10:37:58 0 337
Bharat Aawaz
​🎋 ఉగాది శుభాకాంక్షలు! 🎋
​🌿 శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! 🌿 ​ఈ ఉగాది మీ జీవితంలో సరికొత్త కాంతులను...
By Bharat Aawaz 2026-03-19 02:03:14 0 987
Andhra Pradesh
రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే చర్యలు
రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసిన, తరలిస్తున్న చట్టపరంగా చర్యలు తప్పవని తహశీల్దార్ ప్రసన్నకుమార్...
By Boiena Rajesh 2026-09-06 05:13:28 0 97
Andhra Pradesh
డీఐజీ ప్రకటన గంటల్లోనే నిందితుడు శవమై తేలిన ఘటన.
మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ మంగళవారం కనసానివారిపల్లి...
By Pagadala Venkateswar 2026-02-18 06:48:35 0 206
Telangana
దుగ్గొండి మండలం మొక్కజొన్న రైతులకు బి ఆర్ ఎస్ పార్టీ నిరస
మొక్కజొన్న రైతులకు మద్దతుగా నర్సంపేట మాజీ శాసన సభ్యులు శ్రీ  పెద్ది సుదర్శన్ రెడ్డి గారు...
By Gujile Ramu 2026-04-22 16:35:43 0 261
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com