కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కుట్టు మిషన్ల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు

0
253

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో మంగళవారం భారీ సంక్షేమ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక మరియు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మొదటగా, జిల్లాలో రెండో విడత కింద ఎంపికైన అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. పేద ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల మంజూరు జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.ఆ తర్వాత, మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా స్థిరపడాలనే సంకల్పంతో జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన 270 మంది మహిళా లబ్ధిదారులకు ఇందిరమ్మ కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మహిళలు కేవలం గృహిణులుగానే పరిమితం కాకుండా ఇలాంటి ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు దండే విఠల్, సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు, జిల్లా కలెక్టర్ కె. హరిత ఐ.ఏ.ఎస్, గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల మంగ పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా అనుములు
*రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా అనుమోలు...*  ************************...
By Rajini Kumari 2025-12-22 11:21:19 0 249
Telangana
NZB. ఈ నేల 7న చలో ఇందిరా పార్క్
2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వా మెమో 57 అధరంగ హైకోర్ట్ తిర్పును అమలు చేస్తు పత పెన్షాన్...
By Sadaq Sadaq 2026-03-01 15:03:04 0 198
SURAKSHA
Merin Joseph IPS: Inspiring Excellence in Modern Policing
Merin Joseph, IPS – A Symbol of Courage, Compassion, and Leadership The...
By Fathima Safa 2026-07-10 09:35:28 0 158
Telangana
జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం
అర్ధరాత్రి పూట జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల...
By Pinnehasan Odela 2026-01-14 18:42:55 0 264
Andhra Pradesh
దీ నెహ్రు నగర్ వాకర్స్ అసోసియేషన్ వారు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం
నెహ్రు నగర్ వెంకటాద్రి పేటలోని, వృద్ధుల అనాధాశ్రమంలో, దీ నెహ్రు నగర్ వాకర్స్ అసోసియేషన్ వారు...
By John Baji 2025-12-30 01:23:06 0 235
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com