ఏపీలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌.. మదనపల్లెలో 100 ఎకరాల్లో ఏర్పాటు.

0
85

ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ (ఐఎస్‌ఏ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది.

రిలయన్స్‌ సంస్థ సహకారంతో ఈ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా, అంతర్జాతీయ స్థాయి ఃసెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ఃగా ఐఎస్‌ఏను అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం.మరికొన్ని అంతర్జాతీయ సంస్థలను కూడా భాగస్వాములుగా చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఐఎస్‌ఏ ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

ఆగస్టు నెలాఖరులోగా రిలయన్స్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరే అవకాశం ఉంది.అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఐఎస్‌ఏను ఏర్పాటు చేయనున్నారు.

 

ఎంబీఏ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌.. డిజిటల్‌ అగ్రికల్చర్‌లో మాస్టర్స్

ఐఎస్‌ఏలో వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు సంబంధించిన ఆధునిక, సాంకేతిక అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.రాష్ట్రంలో ఇప్పటికే వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ, మత్స్య విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.ఆయా విశ్వవిద్యాలయాల్లో వివిధ సంప్రదాయ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.అయితే వాటికి భిన్నంగా ఐఎస్‌ఏ ద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఆధునిక విద్య, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్‌ అగ్రికల్చర్‌, వాతావరణ సుస్థిరత వంటి కీలక అంశాలపై ఐఎస్‌ఏలో ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు.ఎంబీఏ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌, డిజిటల్‌ అగ్రికల్చర్‌లో మాస్టర్స్‌ కోర్సులతో పాటు ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ వంటి ప్రపంచస్థాయి కోర్సులను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
కేసీఆర్ తెలంగాణకు తురుపు ముక్క కాదు...కలుపు మొక్క..బల్మురి వెంకట్
కేసీఆర్ తెలంగాణకు తురుపు ముక్క కాదు...కలుపు మొక్క. ‎కేసీఆర్ తెలంగాణకు ఓజీ కాదు.... నాజీ గా...
By Ponnala Srinivasrao 2026-06-04 04:59:17 0 127
Andhra Pradesh
కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మెమోరాండం ఇచ్చిన బీజేపీ నాయకులు జర్నలిస్ట్ డి.వి.ప్రతాప్.
గుర్రంకొండలోని అతి పురాతనమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యం దీప ధూప నైవేద్యాలు జరిగేలా...
By Pagadala Venkateswar 2026-08-18 07:24:52 0 68
Manipur
Dr. Puneet Kumar Goel Appointed New Chief Secretary of Manipur
The Appointments Committee of the Cabinet has appointed Dr. Puneet Kumar Goel, a 1991-batch IAS...
By Bharat Aawaz 2025-07-17 08:24:04 0 1K
Andhra Pradesh
అమరావతి రాజధాని బిల్లు ఆమోదం రాష్ట్ర వ్యాప్తంగా ఆనంద ఉత్సవాహం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా...
By Benguluri Madhubabu 2026-04-02 11:11:52 0 278
Andhra Pradesh
నిమ్మలపల్లెలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు యువకులను...
By Pagadala Venkateswar 2026-05-04 05:55:34 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com