ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
బుధవారం కోసిగి మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి నరసింహులు ఎంపిటిసి రాజు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుదర్శన్ మండల కార్యదర్శి గోపాల్ పాల్గొన్నారు ముందుగా స్థానిక సిపిఐ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి ఇంటిగ్రేడ్ హాస్టల్ గేట్ దగ్గర ఏఐఎస్ఎఫ్ పథకాన్ని మాజీ జిల్లా కోశాధికారి నరసింహులు చేతుల మీదుగా ఎగరవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోసిగి మండలలో విద్యారంగా సమస్యలపై ఎనలేని ఉద్యమా,పోరాటాలు నిర్వహిస్తు, సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాడుతున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అన్నారు నాటునుండి నేటి వరకు స్వాతంత్ర ఉద్యమంలోనూ విద్యార్థి ఉద్యమంలోనూ ఏఐఎస్ఎఫ్ అగ్రస్థానంలో ఉంటుందని కొనియాడారు. ఎక్కడ విద్యాసంస్థలు మూతపడితే అక్కడ ఏఐఎస్ఎఫ్ ముందు ఉంటుందని వారన్నారు అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు యస్.ఈరేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరాలు గడుస్తున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విద్యాశాఖ మంత్రి విద్య రంగాన్ని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు దార దత్తం చేయడమే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని నిరుద్యోగులకు 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి నేడు విద్యార్థి యువతను రాపిడో, జొమాటో, డ్రైవర్లుగా మార్చేశారని విమర్శించారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేస్తానని హామీ ఇచ్చి హామీని హామీగానే మిగిల్చారన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి అలాగే విద్యారంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి తాయన్న ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు మల్లికార్జున, అజయ్ కుమార్,తేజ,ఆకాష్,నాగరాజు,నాగేష్,చందు,నవీన్,మల్లికార్జున,వంశీ,దానియేలు,రాజు,హర్ష,అది,నాయుడు,మణికుమార్,మహేష్,వీరనాగప్ప,అనిల్,కుమార్,ఈరన్న జీవన్,కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz