ఇస్కాదామెర్ల KVR కాలనీలో స్థల వివాదం – గ్రామస్తుల న్యాయం కోసం పోరాటం
సమస్య నేపథ్యం:
Kvr colony/ ఇస్కదామెర్ల. గ్రామంలో ప్రతి సంవత్సరం అమ్మవారి పొంగళ్లు (అంకమ్మ తల్లి పొంగళ్లు / పోలేరమ్మ తల్లి పొంగళ్లు)
జరుపుకుంటాము. గ్రామంలో గుడి లేదు. దీంతో ఊరి బయట పొలంలో పొంగళ్లు పెట్టుకునే పరిస్థితి ఉంది అంటున్నారు గ్రామ ప్రజలు.
ఈ వేడుకలకు సంబంధించి ఊరి పెద్దమనిషి- (అన్నెం సుబ్బారెడ్డి) అనే గౌరవనీయ వ్యక్తి రోడ్డు పక్కన ఉన్న కొంత స్థలాన్ని మంచి మనసుతో అమ్మవారి కోసం సమర్పించారు . ఆ స్థలంలో పొంగళ్లు నిర్వహించుకుంటున్నారు.
గ్రామ ప్రజలు.
వివాదం ఎలా మొదలైంది?
గ్రామం లో నివసిస్తున్న ప్రజలకు రోడ్డు లేకుండా
చేశారు.
ఇస్కాదామెర్ల KVR కాలనీలో కొంతమంది వ్యక్తులు "ఆ స్థలం మాది" అని వాదిస్తున్నారు. రాత్రి సమయంలో ఆ స్థలంలో ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఈ చర్యపై గ్రామంలో అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అధికారులు వచ్చి వెళ్ళారు.
కానీ ఈరోజు కి రెస్పాన్స్ లేదు ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు అంటున్నారు గ్రామ ప్రజలు.
గ్రామ ప్రజలు విజ్ఞప్తి:
దయచేసి గ్రామానికి సంబంధించిన అధికారులు ఈ విషయంలో , సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము. సంప్రదాయ వేడుకలకు అడ్డంకి రాకుండా చూడాలి.
(గ్రామ ప్రజలు డిమాండ్లు:)
స్థల వివాదంపై స్థానిక అధికారులు విచారణ జరపాలి
గ్రామ ప్రజలు:
సంప్రదాయ పొంగళ్లకు అనుమతి ఇవ్వాలి
రాత్రిపూట ఫెన్సింగ్ వేసిన వ్యక్తులపై చర్య తీసుకోవాలి
గ్రామస్తుల మధ్య శాంతి నెలకొల్పాలి.
గమనిక: ఈ విషయంలో న్యాయం జరగాలని, సంప్రదాయాలు కాపాడబడాలని గ్రామస్తుల కోరిక. అధికారులు త్వరగా స్పందించి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz