ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో డ్యూటీలో చేరిన రోజే రాజీనామా చేసిన డాక్టర్ పబ్లిన్ కౌర్

0
162

ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో పబ్లిన్ కౌర్ అనే ఓ డాక్టర్ డ్యూటీలో చేరిన రోజే రాజీనామా చేసింది . రాజీనామాకు కారణం ఏంటో తెలుసా..? పవిత్రమైన మెడిసిన్ చదివి మేనేజ్మెంట్ చెప్పినట్టు విని రోగులను డబ్బులు కోసం పీడించలేనని, అవసరం లేకపోయినా వారిని ఐసీయూలో చేర్చి రోజుకి టార్గెట్ ప్రకారం డబ్బులు దండలేనని అలా చేసి పాపం మూట కట్టుకోలేనని రాజీనామా చేసేసింది. దేశంలో అనేక కార్పొరేట్ హాస్పిటల్స్ లో జరిగే నీచ నికృష్ణ నిర్భాగ్య పరిస్థితికి ఆమె మాటలు దర్పణం పడుతున్నాయి. వైద్య వృత్తిని పూర్తిగా వ్యాపారమయం చేసేసి ఒకరకంగా చెప్పాలంటే దోపిడీ దొంగలమాదిరి పేషెంట్లను దోచుకునే హాస్పిటల్స్ వైఖరికి ఆమె మాటలే నిదర్శనం. డాక్టర్లను సేల్స్ మేనేజర్లుగా మార్చిన కార్పొరేట్ నికృష్ట వైఖరికి ఇది నిదర్శనం. అవసరం లేకపోయినా సాధ్యమైనంత వరకు పేషెంట్లని ఐసీయూలోనే ఉంచాలని మందులు ఎక్కువ రాయాలని టెస్టులు ఎక్కువ చేయించాలని ఆ విధంగా రోజుకి ఇంత సంపాదించి పెట్టాలని ఆమె డ్యూటీలో చేరిన తర్వాత హాస్పిటల్ పెద్దలు క్లాస్ పీకారు. సీనియర్ డాక్టర్లు ఐసీయూలో అడ్మిట్ చేయమంటే చేయాలని ఆ ఫైల్స్ మీద సంతకం పెట్టాలని కూడా చెప్పారు . మొదటి సమావేశంలోనే ఆమెకు హాస్పిటల్ లో జరిగేది వైద్యం కాదని ఇది వ్యాపారం అని అర్థమైంది. వెంటనే తన రాజీనామా లేఖన రాసి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆమె చేసిన రాజీనామా దేశ వ్యాప్తంగా చర్చకు కారణమైంది.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల్: సింగరేణి గనులకు జాతీయస్థాయి 5-స్టార్ రేటింగ్
కేంద్ర బొగ్గు శాఖ ప్రకటించిన 2024-2025 జాతీయ ఉత్తమ గనుల జాబితాలో సింగరేణి సంస్థ ఘనత సాధించింది....
By Bonagiri RaviShankar 2026-07-11 05:38:13 0 241
Andhra Pradesh
నిమ్మనపల్లెలో యువకుడిపై కోడి కత్తులతో దాడి.
శనివారం రాత్రి నిమ్మనపల్లె మండలం రాతివారిపల్లెలో ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఆవుల నరేశ్ (27) పై...
By Pagadala Venkateswar 2026-06-14 06:18:22 0 106
Andhra Pradesh
మదనపల్లె: బాధితులకు ఆమోదయోగ్యమైన పరిహారం అందిస్తాం.
మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి బుధవారం మాట్లాడుతూ, జాతీయ రహదారి-71 (NH 71) విస్తరణలో భూములు...
By Pagadala Venkateswar 2026-05-28 05:23:45 0 100
Madhya Pradesh
Madhya Pradesh Expands Infrastructure and Connectivity
Madhya Pradesh continues to accelerate infrastructure development by expanding highways,...
By Fathima Safa 2026-07-06 08:00:23 0 134
Karnataka
Bengaluru Faces Rat-Fever Spike Amid Sanitation Crisis
Since the beginning of 2025, over 400 cases of leptospirosis (rat fever) have been reported in...
By Bharat Aawaz 2025-07-17 06:39:49 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com