బిజెపి నాయకుల ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ వైద్యాధికారి డాక్టర్ నాగేంద్రకు ఘన సన్మానం

0
190

🎤భారత్ ఆవాజ్, కొమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి జగదీష్: కొమురం భీం ఆసిఫాబాద్ నూతన వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా (DMHO) బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నాగేంద్రను బిజెపి నాయకులు ఘనంగా సన్మానించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మొదటిసారిగా అరిగెల నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు అరిగెల నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ మరియు బిజెపి ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఒక మారుమూల ప్రాంతంలో జన్మించి, ఇక్కడి వైద్య సవాళ్లను స్వీకరించి, ప్రజలకే వైద్యాధికారిగా సేవ చేసే అవకాశం రావడం చాలా అభినందనీయమని కొనియాడారు. అనంతరం వైద్యాధికారి మాట్లాడుతు. ఆదివాసి గ్రామాలలో వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించి మంచి గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కుందరపు బాలకృష్ణ, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
విద్యార్థులను అభినందించిన డీఈవో
విద్యా వారోత్సవాల్లో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన ఆర్ట్ , క్రాఫ్ట్, డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ...
By Nookapangu Manikanta 2026-05-16 10:28:35 0 321
SURAKSHA
Ashish Kundra: Driving Governance with Vision and Innovation
A distinguished 1996-batch AGMUT cadre IAS officer whose administrative excellence,...
By Kalaga Sailaja 2026-07-24 12:01:56 0 144
Andhra Pradesh
పుంగనూరులో సిపిఐ నాయకుల నిరసన
పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద సీపీఐ నాయకులు ఆదివారం ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన...
By Kothuru Murali 2026-05-24 17:30:51 0 111
Puducherry
Puducherry Strengthens Sports Infrastructure and Youth
Puducherry is enhancing sports infrastructure and youth development through investments in modern...
By Fathima Safa 2026-06-29 09:01:35 0 131
Andhra Pradesh
కేంద్రీయ విద్యాలయం, మదనపల్లిలో అడ్మిషన్లు ప్రారంభం.
మదనపల్లెలోని కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి....
By Pagadala Venkateswar 2026-03-21 06:05:04 0 250
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com