కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో కలకలం జిల్లా ప్రధాన కార్యదర్శి గాదవేణి మల్లేష్ రాజీనామా

0
172

🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారాయి. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదవేణి మల్లేష్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, కేవలం వ్యక్తిగత కారణాల వల్లనే తాను జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంటూ తన రాజీనామా లేఖను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణకు అందజేశారు. అయితే పదవికి రాజీనామా చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీతో తనకున్న అనుబంధం కొనసాగుతుందని, సాధారణ కార్యకర్తగా పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ బలోపేతానికి మరియు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మల్లేష్ స్పష్టం చేశారు. కాగా, గాదవేణి మల్లేష్ సమర్పించిన రాజీనామా లేఖను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ సుదీర్ఘంగా పరిశీలించి, పార్టీ అధిష్ఠానం ఆమోదానికి లోబడి ఈ రాజీనామాపై తక్షణమే ఆమోద ముద్ర వేశారు. ఈ నెల 10వ తేదీ నుండి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పదవికి ఆయన చేసిన రాజీనామా అధికారికంగా అమలులోకి వస్తున్నట్లు ధ్రువీకరిస్తూ లేఖపై అధికారిక ముద్రతో ఆమె సంతకం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విశ్వబ్రాహ్మణ సంఘం చెక్క కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆవు దూడ గుర్తు పై ఓటు వేయాలని అభ్యర్థన
*విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న కత్తురోజు రామకృష్ణ*  ...
By Rajini Kumari 2026-03-27 12:49:29 0 233
SURAKSHA
: Bengaluru Police Plant Trees For Green Bengaluru
 As part of environmental protection, Bengaluru Police today led a massive tree plantation...
By Kalaga Sailaja 2026-07-06 06:43:59 0 131
Andhra Pradesh
ప్రజా దర్బార్ లో సమస్యలు విన్న ఎమ్మెల్యే షాజహాన్ భాష.
మదనపల్లెలో సోమవారం జరిగిన ప్రజా దర్బార్ లో స్థానిక ప్రజలు తమ సమస్యలను మదనపల్లి శాసనసభ్యులు యం....
By Pagadala Venkateswar 2026-03-02 07:53:29 0 190
Andhra Pradesh
పుంగనూరు: వైసిపి స్టేట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా హేమచంద్ర
వైసిపి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, శుక్రవారం చిత్తూరు జిల్లా, పుంగనూరు...
By Kothuru Murali 2026-02-21 08:31:43 0 177
Andhra Pradesh
13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం... మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు.
పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం...
By Pagadala Venkateswar 2026-04-10 06:06:50 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com