శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో దాడుల కలకలం

0
174

శ్రీరాంపూర్, ఆగస్టు 10:శ్రీరాంపూర్‌లోని ప్రగతి స్టేడియం నిన్న రాత్రి ఉద్రిక్తతకు వేదికగా మారింది. యువకులపై రాడ్లు, కర్రలతో దాడి జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనలో పలువురు యువకులు గాయపడినట్లు సమాచారం,బాధితుల వర్గాల వివరాల ప్రకారం.. కొందరు వ్యక్తులు గుంపుగా వచ్చి యువకులపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో మహిళలతో కళ్లలో కారం కొట్టించి, అనంతరం దాడి చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి,ఈ ఘటనలో భరత్ అనే వ్యక్తి పేరు స్థానికంగా వినిపిస్తుండటంతో పోలీసులు దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఏర్పడింది. సిటీ ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లో స్థానిక యువతకు సంబంధించిన ఘర్షణలు, వివాదాలపై కూడా పోలీసులు నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

క్రీడా మైదానమా.. ఘర్షణల అడ్డానా?

క్రీడాకారులు, యువత కోసం ఉపయోగించాల్సిన ప్రగతి స్టేడియంలోనే ఇలాంటి దాడి జరగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసుల పెట్రోలింగ్ పెంచి, ప్రజలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

దాడికి అసలు కారణం ఏమిటి? ఘటన వెనుక ఉన్నవారెవరు? భరత్ పాత్ర ఏమిటి? సిటీ ప్యాలెస్ పరిసరాల్లో జరుగుతున్న కార్యకలాపాలపై పోలీసుల చర్యలు ఏమిటి? అన్న ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులో సమాధానం రావాల్సి ఉంది.

Search
Categories
Read More
Kerala
Kerala: Wife allegedly murdered husband in Kannur's Kaithapram village
Kannur Murder Case: Auto Driver’s Wife Arrested for Allegedly Orchestrating Husband’s...
By BMA ADMIN 2025-05-20 05:14:04 0 2K
Andhra Pradesh
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నరసాపూర్ నుండి గుడివాడ వరకు వందే భారత్ రైలు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ ప్రముఖులు
*నరసాపురంలో సందడి చేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము....*   *కేంద్ర మంత్రి భూపతి రాజు...
By Rajini Kumari 2025-12-15 11:00:12 0 413
Madhya Pradesh
Madhya Pradesh Expands Digital Governance and Services
Madhya Pradesh is advancing digital governance by expanding online citizen services,...
By Fathima Safa 2026-06-30 08:30:02 0 80
SURAKSHA
Sagar Singh Kalsi IPS: Leading with Vision and Integrity
The Journey Begins "The badge is not just a symbol of authority—it is a...
By Fathima Safa 2026-07-23 10:14:01 0 141
Andhra Pradesh
హైవేపై దగ్ధమైన ప్రైవేట్ బస్సు... డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఘటన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా...
By Pagadala Venkateswar 2026-05-30 05:16:58 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com