Bharat Aawaz

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ఆంధ్రా స్పైస్ రెస్టారెంట్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు, మంటలతో స్థానికులు భయాందోళన.

Pagadala Venkateswar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
233
Views

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని ఆంధ్రా స్పైస్ రెస్టారెంట్‌లో ఆదివారం ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్ నుంచి భారీగా పొగలు, మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 

కొంతసేపు వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. వారి శ్రమతో మంటలు మరింత వ్యాపించకుండా నియంత్రించే ప్రయత్నాలు కొనసాగాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ఆస్తి నష్టం ఎంత జరిగింది, ఎలాంటి ప్రాణనష్టం సంభవించిందా అనే వివరాలు అధికారుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.