జగద్గిరిగుట్టలో భక్తి వెల్లువ.. బోనాల పండుగ వైభవం.|

0
147

● అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ ఈటల రాజేందర్

● తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి బోనాలు ప్రతీక: ఈటల

మేడ్చల్ మల్కాజిగిరి, జగద్గిరిగుట్ట, ఆగస్టు 9: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల వేడుకలు జగద్గిరిగుట్టలో ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి.

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం జగద్గిరిగుట్టలోని సంజయ్‌పురి కాలనీ, అంజయ్యనగర్‌లో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.

జగన్మాత దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సకల సంపదలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ వేడుకల్లో మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు డి. గిరివర్ధన్ రెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు జేకే శేఖర్ యాదవ్, సీనియర్ నాయకులు కంచి మహేందర్ యాదవ్, సుబ్బారావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
ఒకప్పటి స్టార్ ఆఫీసర్లకు ఏమైంది? తెలంగాణలో #స్మితాసబర్వాల్...ఏపీలో #ఆమ్రపాలి
తెలుగు రాష్ట్రాల అధికార యంత్రాంగంలో ఒకప్పుడు తమదైన మార్కుతో దూసుకెళ్లిన ఐఏఎస్ అధికారులు వారు....
By Ponnala Srinivasrao 2026-08-09 01:42:45 0 142
Andhra Pradesh
మదనపల్లిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో, 25...
By Pagadala Venkateswar 2026-01-13 07:41:48 0 217
Telangana
జన్ ఔషధి కేంద్రాల బలోపేతానికి కీలక సూచనలు.. ఎంపీ ఈటెల.|
హైదరాబాద్ :పార్లమెంట్‌లో రూల్ 377 కింద ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్...
By Sidhu Maroju 2026-04-01 17:54:09 0 216
Andhra Pradesh
మహాశివరాత్రి మహోత్సవానికి ఏర్పాట్లు
మహాశివరాత్రి మహోత్సవానికి ఏర్పాట్లు... త్రిపురాంతకం మండలం, త్రిపురాంతకం గ్రామంలో గల శ్రీ...
By Chennaiah Kati 2026-01-22 13:03:41 0 416
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com