అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి..!సజ్జనార్
అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి..!
జాగ్రత్త అని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ గారు హెచ్చరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వెనుక సైబర్ మోసం ఉందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సజ్జనార్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అమ్మాయిలు, యువతులే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త డేటింగ్ పేరుతో ట్రాప్ చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఆకర్షణీయమైన పోస్టర్లతో సైబర్ క్రిమినల్స్ యువతులకు వల వేస్తున్నారని తెలిపారు. ‘1st August Special – 50% OFF’ అంటూ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించారని చెప్పుకొచ్చారు. కాఫీ డేట్ - రూ.499, సినిమా డేట్ - రూ.1,249 అంటూ ప్యాకేజీలు ప్రకటించారని తెలిపారు. షాపింగ్, ఈవెంట్లు, పెళ్లిళ్లకు తోడుగా వస్తామంటూ వివిధ ధరలతో సైబర్ క్రిమినల్స్ ఆఫర్లు ఇచ్చారని వెల్లడించారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz