తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. లోయలో పడిన కారు, ఒకరి మృతి.

0
116

తిరుమలలో విషాదం నెలకొంది. శ్రీవారి దర్శనం అనంతరం తిరిగి వెళుతున్న భక్తుల కారు అదుపుతప్పి లోయలో పడటంతో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందగా, మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం శుక్రవారం తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్డులో చోటుచేసుకుంది.

 

బెంగళూరులోని గొట్టిగెరెకు చెందిన సతీష్ కుమార్ (72) తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. స్వామివారి దర్శనం ముగించుకుని కారులో తిరుగు ప్రయాణమైన క్రమంలో, 22వ హెయిర్‌పిన్ బెండ్ వద్ద వాహనం అదుపుతప్పింది. వేగంగా వెళుతూ రక్షణ గోడను ఢీకొట్టిన కారు, సుమారు 15 అడుగుల లోతులో ఉన్న లోయలో పడిపోయింది.

 

ఈ ప్రమాదంలో సతీష్ కుమార్‌ కుమారుడు సాయి శ్రీనివాస్, కుమార్తె సింధు ఉడత్, మనవరాళ్లు తియా, నైరాలకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సతీశ్ కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా గుంటూరు జిల్లా పోలీసుల విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు.
📍గంజాయి సంబంధిత, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్న పోలీసులు....
By John Baji 2026-01-21 13:37:06 0 261
Tamilnadu
CPI(M) Demands CB-CID Probe into Isha Yoga Center Deaths
The Communist Party of India (Marxist) Tamil Nadu State Committee has formally called upon the...
By Lokeshwari Panthadi 2026-06-27 10:38:10 0 180
Andhra Pradesh
Chowdepalle: శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో రికార్డ్ స్థాయిలో 54 రోజులకు రూ. 1.25 కోట్ల హుండీ ఆదాయం. వివరాలు వెల్లడించిన ఈఓ ఏకాంబరం.
Chowdepalle: అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా...
By Pagadala Venkateswar 2026-07-14 07:18:25 0 96
Andhra Pradesh
టిడిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన లీడర్ టు కేడర్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కాశినేని మహేంద్ర నాయుడు
 ఆయనతోపాటు 175 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం...
By Benguluri Madhubabu 2026-04-07 06:35:13 0 241
Gujarat
Tragedy in Bharuch: Mall Wall Collapse Claims Two Lives
A devastating incident occurred in Bharuch today as a shopping mall’s compound wall...
By Lokeshwari Panthadi 2026-07-01 06:18:17 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com