Madanapalle: మదనపల్లె మండలం కొత్తపల్లి పంచాయతీ కొత్త ఇండ్లలో గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో తల్లి, కూతురు తీవ్రంగా గాయపడ్డారు.

0
102

Madanapalle: మదనపల్లె మండలంలో గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగి తల్లి, కూతురు తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కొత్త ఇండ్లలో నివాసం ఉంటున్న లేట్ నాగ భార్య, ప్రత్యేక ప్రతిభావంతురాలు జ్యోతి (26) తన కుమార్తె లహరి (8)ను పాఠశాలకు పంపేందుకు సిద్ధం చేస్తోంది.

 

ఈ క్రమంలో కుమార్తెకు స్నానం చేయించేందుకు బాత్రూంకు తీసుకెళ్లి, గీజర్‌కు అమర్చిన గ్యాస్ సిలిండర్‌ను ఆన్ చేయగానే ఒక్కసారిగా గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగాయి. అనూహ్యంగా మంటలు వ్యాపించడంతో తల్లి, కూతురు ఇద్దరూ మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. వారి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి, బాధితులను రక్షించారు. అనంతరం గాయపడిన జ్యోతి, లహరిని స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Search
Categories
Read More
Rajasthan
Rajasthan Strengthens Agriculture and Rural Development
Rajasthan is enhancing agriculture and rural development through improved irrigation, sustainable...
By Fathima Safa 2026-06-30 12:17:26 0 89
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గ:చౌడేపల్లిలో గంగమ్మ జాతర దీపాల వెలుగుల్లో ఆధ్యాత్మిక శోభ
చౌడేపల్లి పట్టణంలో గంగమ్మ జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామం మొత్తం దీపాలతో అలంకరించి...
By Kothuru Murali 2026-04-08 09:32:31 0 156
SURAKSHA
Harmeet Singh, IPS: Leading Assam Police with Courage
The Journey Begins "A police force earns public trust not only through...
By Fathima Safa 2026-07-23 02:45:44 0 118
Telangana
ప్రాణాలకు ప్రమాదంగా మారుతున్న ఈ LED లైట్లపై ప్రభుత్వం ఎప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుంది?
రోడ్లపై LED లైట్ల టార్చర్.. వాహనాలకు LED లైట్ల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని సోషల్...
By Ponnala Srinivasrao 2026-05-27 12:33:26 0 148
Andhra Pradesh
నిమ్మనపల్లెలో ఒకేరోజు ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యం.
శుక్రవారం నిమ్మనపల్లె మండలంలో 16 ఏళ్ల ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యం కావడం కలకలం రేపింది. వారి...
By Pagadala Venkateswar 2026-06-27 05:39:20 0 101
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com