తెలుగు మాటక రంగ పితామహుడు బళ్లారి రాఘవ పోలీస్ శాఖ ఘన నివాళి

0
220

అన్నమయ్య జిల్లా - మదనపల్లె

తేదీ:02.08.2026

 

తెలుగు నాటక రంగ పితామహుడు బళ్లారి రాఘవకు పోలీసు శాఖ ఘన నివాళి..

 

సమాజ మార్పు కోసం కళను ఆయుధంగా మలసిన మహానుభావుడు..

 

 *- అదనపు ఎస్పీ శ్రీ యం. వెంకటాద్రి గారు..*

 

మదనపల్లె, ఆగస్టు 2: తెలుగు నాటక రంగ పితామహుడు శ్రీ బళ్ళారి రాఘవ జయంతిని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం.వెంకటాద్రి పాల్గొని రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బళ్ళారి రాఘవ కేవలం కళాకారుడే కాకుండా తన కళ ద్వారా సమాజంలోని దురాచారాలను ప్రశ్నించిన గొప్ప సంస్కర్త అని, ప్రజల్లో నైతిక విలువలు పెంపొందించిన ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని కొనియాడారు. బాధ్యతాయుత పౌరులుగా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ సమాజానికి మేలు చేయడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ (అడ్మిన్) యు.రంగనాథ్ బాబు, ఆర్‌ఎస్‌ఐలు శ్రీనివాస్, రవి, చంద్రశేఖర్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
లింగ నిర్దారణ చట్టం జిల్లా స్థాయి సమావేశం
కలెక్టర్ కార్యాలయం నందు గర్భస్థ లింగ నిర్ధారణ చట్టము మరియు ఏఆర్టి /సరోగసి జిల్లా స్థాయి సమావేశము...
By John Baji 2025-12-31 01:43:22 0 199
Telangana
మల్కాజ్ గిరి డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు
   మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మల్కాజ్ గిరి.   మల్కాజ్ గిరి కార్పొరేటర్...
By Sidhu Maroju 2025-07-23 16:39:39 0 1K
Telangana
"హరిజనబస్తీ డిసిల్టింగ్‌పై శాంతి శ్రీనివాస్ రెడ్డి ఫోకస్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హరిజనబస్తీ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న డిసిల్టింగ్ (మట్టిని...
By Sidhu Maroju 2026-04-20 13:00:04 0 167
Telangana
పంట నష్ట బాధితులకు బాసటగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
మెదక్ జిల్లా:  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మెతుకు సీమ అతలాకుతలం అయింది.తాజాగా పాపన్నపేట్...
By Sidhu Maroju 2025-09-01 13:13:24 0 461
Telangana
అభివృద్ధిలో దూసుకుపోతున్న గండిమైసమ్మ X రోడ్
గండిమైసమ్మ X రోడ్ హైదరాబాద్‌లోని బాచుపల్లి - దుండిగల్ ప్రధాన రహదారిపై ఉన్న ఒక ప్రముఖ మరియు...
By Ponnala Srinivasrao 2026-03-14 03:16:09 0 299
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com