సూపర్ ఎల్ నినో సమయంలో ప్రతి నీటి బొట్టు విలువైనదే: పవన్ కల్యాణ్.

0
100

రాష్ట్రంలో సూపర్‌ ఎల్‌నినో ప్రభావం వల్ల నెలకొన్న సాగునీటి కొరతపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టు ఎంతో అమూల్యమైనదని, కాలువల్లో పూడిక తీత, గట్ల లీకేజీల నివారణ వంటి తక్షణ చర్యల ద్వారా నీటి వృథాను అరికట్టాలని పిలుపునిచ్చారు.

 

 

డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి పరిస్థితులపై ఇరువురూ విస్తృతంగా చర్చించారు. నీటి ఎద్దడిపై రైతుల్లో అవగాహన కల్పించడంతో పాటు, ప్రత్యామ్నాయ సాగు మార్గాలపై దృష్టి సారించాలని పవన్ సూచించారు. రైతుల ఆందోళనను తగ్గించేందుకు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు.

 

 

పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల రైతు ప్రయోజనాల కోసం ఏలేరు ప్రాజెక్టు నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేసినందుకు మంత్రి నిమ్మల రామానాయుడికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు తానే స్వయంగా ఏలేరు ఆయకట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు మంత్రి వివరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
RTC Buses: సంక్రాంతి వేళ రాష్ట్ర ప్రజలకు బిగ్ షాక్.. ఆర్టీసీ బస్సులు బంద్..! కష్టాలు తప్పవ్..
సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు షాక్ తగిలింది. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెకు...
By Pagadala Venkateswar 2026-01-13 06:03:48 0 265
Andhra Pradesh
ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్ కుమార్ తో మంత్రి మండిపల్లి భేటీ
Press Release  సచివాలయం,అమరావతి  (10-07-2026).    *హింద్రీనివా సుజల...
By Benguluri Madhubabu 2026-07-10 13:56:36 0 201
Andhra Pradesh
నేడు మా ఘ పౌర్ణమి
ఈ నెల  19నుంచి  మాఘ పౌర్ణమి స్నా నా లు మొదులు అయి ఫిబ్రవరి 16 వరకు  పూర్తి...
By Mobbu Venkatramana 2026-02-01 10:29:58 0 505
Telangana
రెండు బైకలు డికొన్నాయి
సంగారెడ్డి నుంచి అకోలా వెళ్లే జాతీయ రహదారి పైన అల్లదుర్గ్ చౌరస్తా దగ్గర రెండు బైకలు ఎదురు ఎదురుగా...
By Gandla Vaijanath 2026-06-04 07:32:05 0 251
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com