చీరాల బెస్తపాలెం సాయిబాబా గుడి వద్ద ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు —

0
203

చీరాల 

చీరాలలోని బెస్తపాలెం శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం వద్ద గురుపౌర్ణమి వేడుకలు, ఆలయ 25వ వార్షికోత్సవం వేడుకలు బెస్తపాలెం సాయిబాబా కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో శోభాయమానంగా సాగాయి.

వేడుకల్లో భాగంగా 150 నుండి 200 మందికి పైగా నిరుపేదలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అలాగే పేదవారికి విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అనంతరం సుమారు 6,000 నుండి 7,000 మంది భక్తులకు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ వేడుకలకు, సేవా కార్యక్రమాలకు ధన వస్తు రూపంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ బెస్తపాలెం యూత్ మహిళలు గ్రామప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. సాయిబాబా ఆశీస్సులు భక్తులందరిపై నిరంతరం ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తుపాకుల ప్రసాద్, పల్లా వెంకటేష్, తుపాకుల రఘునాథ్, తుపాకుల లీల కృష్ణ, తుపాకుల శివ నాగరాజు, తుపాకుల విజయ్, తుపాకుల సాయి జగదీష్, పల్లా శ్రీనివాసరావు, పల్లా గోపాల్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

References

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన.
  ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన...
By Pagadala Venkateswar 2026-06-06 06:09:07 0 118
Andhra Pradesh
సంక్షేమ హాస్టల్స్, లోకి విద్యార్థి సంఘాల నాయకుల నిషేధాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని DSF విద్యార్థి సంఘంగా డిమాండ్
ఈ సందర్భంగా ప్రెస్‌ మీట్‌ను ఉద్దేశించి ఆదోని DSF డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ శేఖర్...
By Boya Dasthagiri 2026-08-10 10:52:31 0 152
Andhra Pradesh
ఏయూ వందేళ్ల వేడుకలు... వేదికపై నుంచి చంద్రబాబుకు నారా లోకేశ్ విజ్ఞప్తి.
ఏయూ వందేళ్ల వేడుకలు... వేదికపై నుంచి చంద్రబాబుకు నారా లోకేశ్ విజ్ఞప్తి 27-04-2026 Mon 17:13 |...
By Pagadala Venkateswar 2026-04-28 05:53:59 0 153
Andhra Pradesh
పుంగనూరు:అందమైన కుటుంబం.. ప్రమాదంతో కకావికలం.
పుంగనూరు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దపంజాణి(M)రాయలపేటకు చెందిన భాస్కర్ మృతి...
By Kothuru Murali 2026-01-21 09:46:05 0 205
Andhra Pradesh
ఏపీఎస్ఆర్టీసీ కి అవార్డు రావడం సంతోషం మంత్రి మండిపల్లి
రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీకి డిజిటల్...
By Benguluri Madhubabu 2026-01-17 07:39:00 0 341
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com