రాయచోటిలో ప్రజల ఆశీస్సులే రాముడు అన్నకు కొండంత బలం

0
247

*రాయచోటి ప్రజల ఆశీస్సులే రాముడన్న కు కొండంత బలం*

 

 

*20 ఏళ్లుగా ప్రజల మధ్యే ఉంటూ సేవలందిస్తున్న నాయకుడు – టీడీపీ రూరల్ మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్*

 

 

రాష్ట్ర రవాణా మరియు క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రాయచోటి ప్రజల ఆశీస్సులే కొండంత బలమని టీడీపీ రాయచోటి రూరల్ మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ పేర్కొన్నారు. గత 20 సంవత్సరాలుగా పదవిలో ఉన్నా, లేకున్నా ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు రాంప్రసాద్ రెడ్డి అని కొనియాడారు.ప్రజా సేవనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాముడన్నకు ప్రజలతో ఉన్న అనుబంధమే ఆయనకు నిజమైన బలమని సుధాకర్ అన్నారు. అధికారంలో ఉన్న సమయంలోనే కాకుండా, పదవి లేకున్నా ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలిచి ప్రతి ఇంటికీ చేరువైన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని తెలిపారు.ప్రస్తుతం కూడా పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ఎవరు పిలిచినా వారి వద్దకు వెళ్లి పరామర్శిస్తూ, సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న అంకితభావం, సేవా దృక్పథం వల్లే రాయచోటి ప్రజలు ఆయనపై అపారమైన ప్రేమాభిమానాలు చూపిస్తున్నారని అన్నారు.రాష్ట్ర అభివృద్ధితో పాటు రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రజల ఆశీస్సులు, అభిమానమే ఆయనను మరింత ముందుకు నడిపించే శక్తిగా నిలుస్తుందని గండికోట సుధాకర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో యూనిట్ ఇంచార్జ్ నాగార్జునరెడ్డి, రాయచోటి AMC డైరెక్టర్ ఆకుల మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఆశాడమాస బోనాలు.. అమ్మ వార్లను దర్శించుకుని పూజలలో పాల్గొన్న బీజేపీ నాయకులు.
హైదరాబాద్/సికింద్రాబాద్. ఆషాడ మాస లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గం లోని చిలకలగూడ...
By Sidhu Maroju 2025-07-21 07:58:49 0 1K
BMA
River Guardians: Micro-Sensors Expose Illegal Effluents
Sacred rivers and local streams frequently suffer from clandestine industrial effluent dumping...
By JoinBMA 2026-08-22 07:58:22 0 161
Karnataka
Karnataka Boosts Investment Through Global Initiatives
Karnataka continues to strengthen its position as one of India's leading investment destinations...
By Fathima Safa 2026-06-27 12:52:52 0 98
Telangana
మెగా రక్తదాన శిభిరం లో పాల్గొన్న ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్ లో మంచిర్యాల క్లబ్ వారి ఆధ్వర్యంలో రెడ్...
By Avunoori Mahesh 2026-07-11 08:54:36 0 236
SURAKSHA
Shri Amit Sharma, IPS: Courage, Commitment and Modern Policing
A distinguished 2010-batch IPS officer of the AGMUT Cadre, Shri Amit Sharma has built a...
By Kalaga Sailaja 2026-07-29 06:54:10 0 290
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com