రాజ్యాంగ స్ఫూర్తితోనే ప‌ని చేస్తున్నాను‎-చెరువులు.. ప్ర‌భుత్వ ఆస్తులు కాపాడుతున్నాను‎- ఏవీ రంగ‌నాథ్ హైడ్రా క‌మిష‌న‌ర్

0
169

నేను ఈ రెండేళ్ల కాలంలో హైడ్రా కమిషనర్ గా రాజ్యాంగ స్ఫూర్తి ననుసరించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21,48A ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించడం జరిగింది. మార్కెట్లో వీటి విలువ రూ. 1.50 ల‌క్ష‌ల కోట్లు ( 17 బిలియన్ డాలర్లు). ఆరు చెరువులను పూర్తి స్థాయిలో పున‌రుద్ధ‌రించాం. మరో 20 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు కూడా వేగంగా జ‌రుగుతున్నాయి. బడా బాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూముల ను హైడ్రా ఈ రెండు సంవత్సరాల లో వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించింది. నిజం వైపు నిజాయితీ గా నిర్భయంగా, నిబద్ధతతో పని చేస్తాం కాబట్టే హైడ్రా కు ధైర్యం. ల్యాండ్ మాఫియా , భూ కబ్జా దారులు తప్పుడు సమాచారం తో కోర్ట్ లను తప్పు దోవ పట్టిస్తున్నారు. లోతుకుంట భూమి విషయం లో దాదాపు పది వేల కోట్ల రూపాయల భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసింది. పర్మిషన్స్ లేకుండా 2500 కోట్ల సంవత్స రాల హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ వందల చెట్ల‌ను ఎలాంటి అనుమ‌తులు లేకుండా లేకుండా విచ్చల విడిగా విధ్వంసం చేసింది. Save the Rocks Society, పర్యావరణ వేత్తలతో పాటు స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ మీద హైడ్రా రంగం లో కి దిగింది. ఎక్కడో మూడు కిలోమీటర్ల అవతల ఉంద‌ని చెబుతూ లేని భూమిని చూపిస్తూ, ఈ బిల్డ‌ర్ 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి వచ్చి ఆక్రమించి నా మీద కంటెంప్ట్ కేసు వేయటం జరిగింది. నా మీద 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి.. వాటిని వేసింది బడా భూ కబ్జా దారులే. బ‌తుక‌మ్మ‌ కుంట చెరువును మింగేయాలని చూసిన ఒక‌రు, లోతుకుంటలో రూ. వేల కోట్ల ప్రభుత్వ భూమి ని కొట్టేయాలని చూసిన ఇంకొకరు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్ లు కట్టాలని చూస్తున్న సంధ్యా శ్రీధర్ రావు, వేల సంఖ్య‌లో ఉన్న‌ సింగరేణి కార్మికుల ప్లాట్స్ ను కొట్టేయాలని చూసిన ఒక నల్ల మల్లా రెడ్డి, క్రిమినల్ మాఫియా గా చెలామణి అవుతూ రూ. వేల కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్స్, ప్రభుత్వ భూములు ఆక్రమించిన ముఖీం.. వీరందరికీ నేను హైడ్రా కమిషనర్ గా అడ్డు పడడటమే నేను చేసిన తప్పు. వీళ్ళు అందరూ వేసిన కేసులే నా మీద ఉన్న 63 కోర్ట్ ధిక్కార కేసులు. వాటిని నేను చట్ట పరంగానే ఎదుర్కుంటాను. నాకు న్యాయస్థానాలు అంటే పూర్తి నమ్మకం. చ‌ట్టాల ప‌ట్ల గౌర‌వంతో ప‌ని చేస్తూ వ‌స్తున్నాను. గతంలో, ఇప్పుడు, మున్ముందు ప్ర‌భుత్వాలు ఏ బాధ్యతలు అప్పగించినా నేను నా వైపు నుంచి 100% ఫ‌లితాలు ఇవ్వట‌మే ల‌క్ష్యంగా ఉంటాను. అలాగే పని చేస్తున్నాను, భ‌విష్యత్తులో కూడా అదు నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేస్తాను.

 

Search
Categories
Read More
Andhra Pradesh
దాములూరు శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం నిర్మించనున్న రాజగోపురం శంకుస్థాపన
06.03.2026   కూడలి దాములూరు శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో నిర్మించనున్న రాజగోపురం...
By Rajini Kumari 2026-03-06 10:59:47 0 210
SURAKSHA
The Architect of Reform: Shri Anoop Kumar Agrawal’s Visionary Path
Bridging Governance and Progress: A Legacy of Administrative Excellence Shri Anoop Kumar...
By Kalaga Sailaja 2026-07-17 10:28:34 0 120
Andhra Pradesh
అమరజీవి త్యాగస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం: కలెక్టర్.
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం వెలకట్టలేనిదని అన్నమయ్య జిల్లా...
By Pagadala Venkateswar 2026-03-17 02:14:05 0 217
Dadra &Nager Haveli, Daman &Diu
Education Reforms and Digital Learning Expansion 2026
Education sector reforms and digital learning adoption continued to transform the learning...
By Fathima Safa 2026-06-22 10:37:53 0 122
Tripura
Tripura Power Corp Pushes Ahead with Smart Meter Rollout Amid Pushback
Tripura State Electricity Corporation (TSECL) is moving forward with plans to install smart...
By Bharat Aawaz 2025-07-17 07:48:31 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com