పెద్దికి భరోసా.. కేసీఆర్ ఓదార్పు.|

0
105

● యశోద ఆస్పత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం

● వైద్యులతో చికిత్స వివరాలు తెలుసుకున్న మాజీ సీఎం

● అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని వెల్లడించిన డాక్టర్లు

హైదరాబాద్, జూలై 27: యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. ఆస్పత్రికి చేరుకున్న ఆయన.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా వైద్యులను కలిసి చికిత్స కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సుమారు అరగంట పాటు ఆస్పత్రిలోనే ఉండి వైద్యులతో మాట్లాడిన కేసీఆర్.. అందిస్తున్న వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.

"ఏం చేస్తారో చేయండి.. మా పెద్దిని కాపాడండి" అంటూ వైద్యులను కేసీఆర్ కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దేవుడిపై నమ్మకం ఉంచాలని, వైద్యులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారని చెబుతూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని, ప్రస్తుత పరిస్థితిపై పూర్తి స్థాయి సమాచారం అందించేందుకు మరికొంత సమయం అవసరమని వైద్యులు కేసీఆర్‌కు వివరించినట్లు సమాచారం.

ఐసీయూలో అందుతున్న చికిత్స విధానాన్ని పరిశీలించిన అనంతరం కేసీఆర్, కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వారికి భరోసా కల్పించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించారు.

#Sidhumaroju

Search
Categories
Read More
BMA
The Four Pillars: Shifting to Solutions Journalism
Traditional reporting often stops at identifying systemic failures, leaving audiences paralyzed...
By JoinBMA 2026-08-22 04:10:14 0 140
SURAKSHA
: Shakti Teams Strengthen Women’s Safety and Preventive Policing in AP
The Andhra Pradesh Police is significantly bolstering its "Shakti Teams," dedicated to ensuring...
By Kalaga Sailaja 2026-06-30 12:49:31 0 213
Andhra Pradesh
శుభారం డిగ్రీ కళాశాల. పుంగునూరు.
పుంగనూరు: శుభారాం డిగ్రీ కళాశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జానవాణీ ఫిర్యాదు...
By Kothuru Murali 2025-12-23 08:40:51 0 264
Telangana
తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి టార్గెట్ చేరుకోలేకపోయిన సింగరేణి
బ్రేకింగ్ న్యూస్   తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి టార్గెట్ చేరుకోలేకపోయిన సింగరేణి...
By Pinnehasan Odela 2026-04-01 07:17:51 0 183
Andhra Pradesh
మదనపల్లి నుండి కదిరి క్షేత్రానికి 'సుదర్శన సేన' పాదయాత్ర.
కదిరి పౌర్ణమి మహోత్సవాలను పురస్కరించుకుని, మదనపల్లికి చెందిన సుదర్శన సేన సభ్యులు ఆదివారం...
By Pagadala Venkateswar 2026-03-02 03:16:24 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com