కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి

0
230

న్యూఢిల్లీ, జూలై 27:పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, తెలంగాణ రాష్ట్ర గనులు మరియు కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామితో కలిసి కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డిని న్యూఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి అత్యంత కీలకమైన తాడిచెర్ల-2 బొగ్గు గని ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టు ఆలస్యం కాకుండా త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే, తాడిచెర్ల-2 ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు కనీసం 1000 ఉద్యోగాలు కల్పించాలని, ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు R&R (రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్) ప్యాకేజీ కింద సమగ్ర పునరావాసం, పునరుద్ధరణ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా, సింగరేణి సంస్థలో పదవీ విరమణ పొందిన కార్మికులకు కనీస నెలవారీ పెన్షన్ ₹10,000 అందేలా కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రస్తుతం తక్కువ పెన్షన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది రిటైర్డ్ కార్మికుల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 

ఇంకా సింగరేణి సంస్థ అభివృద్ధి, బొగ్గు గనుల విస్తరణ, గనుల ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కూడా కేంద్ర మంత్రితో చర్చించారు.

ఈ అంశాలపై స్పందించిన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి సంబంధిత ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి, తాడిచెర్ల-2 ప్రాజెక్టు పనుల వేగవంతం, స్థానిక యువతకు ఉద్యోగాల కల్పన, R&R ప్యాకేజీ అమలు, అలాగే సింగరేణి పదవీ విరమణ పొందిన కార్మికుల పెన్షన్ అంశాన్ని సంబంధిత శాఖలతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Telangana
ఘనంగా మొహరం పండగ.
కొందుర్గు భారత్ ఆవాజ్: కొందుర్గు మండల కేంద్రంలో మొహరం ఊరేగింపు ఘనంగా జరిగింది. కులామతాలకు...
By Saidupally Ashok 2026-06-26 14:16:44 0 326
Telangana
చినరాయుని చెరువు శుభ్రపరిచే పనులు వేగం - పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక చినరాయుని చెరువును శుభ్రపరిచే ప్రక్రియ వేగవంతమైంది. ఈ...
By Sidhu Maroju 2026-03-10 13:30:28 0 231
Telangana
ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం వాగులో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి ): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒకే ఒక్క క్షణం అలసత్వం...
By Chunarkar Jagadeesh 2026-08-12 16:56:09 0 187
Andhra Pradesh
అనంతపురం: SBI బ్యాంక్ వారి ప్రాపర్టీ ఎక్స్‌పో 2026 ఈ 13,14 తేదీలు మాత్రమే రుణాల ఆఫర్
అనంత: SBI వారి గృహ రుణాలు 13,14 తేదీలలో సంక్రాంతి ఆఫర్లు ఇస్తుంది  వివిధ రియల్ ఎస్టేట్...
By Eslavath RameshNaik 2026-01-14 07:13:08 0 295
SURAKSHA
Lav Agarwal IAS: Leading India's Public Health Mission
A distinguished Andhra Pradesh cadre IAS officer whose visionary leadership in public health,...
By Lokeshwari Panthadi 2026-07-16 05:59:02 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com