ఆసిఫాబాద్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయంలో వార్షిక తనిఖీలు. పోలీస్ శాఖకు ఎస్పీ కీలక ఆదేశాలు

0
263

🎤కుమురం భీం ఆసిఫాబాద్, జూలై 24 (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయంలో వార్షిక తనిఖీలో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ గారు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులు, కేసు ఫైళ్లను నిశితంగా పరిశీలించిన ఎస్పీ గారు, పోలీస్ అధికారులతో ప్రత్యేక సమీక్ష జరిపి విధి నిర్వహణపై కీలక ఆదేశాలను జారీ చేశారు. పోలీస్ స్టేషన్లలోని రికార్డులను, కేసుల ఫైళ్లను సమగ్రంగా పరిశీలన చేయాలని, గ్రేవ్ మరియు పోక్సో కేసుల్లో నిర్దేశిత ఎస్ఓపి ప్రకారం నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని స్పష్టం చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ మరియు ట్రయల్‌లో ఉన్న కేసులపై తక్షణమే వేగవంతమైన చర్యలు తీసుకోవాలని, కార్యాలయాల్లో జాప్యాన్ని నివారించేందుకు '5S విధానాన్ని' అమలు చేసి ఫైల్స్ ను క్రమబద్ధంగా నిర్వహించాలని ఆదేశించారు. సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల దైనందిన పనితీరుపై పైఅధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, అక్రమ కార్యకలాపాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.కుమ్రంభీం జిల్లాలో గంజాయి రవాణా మరియు విక్రయాలపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారు స్పష్టం చేశారు. ప్రజలకు పోలీస్ శాఖ మరింత చేరువయ్యేలా కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా నిరంతరం ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సైబర్ నేరాలు మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. భద్రతను పటిష్టం చేయడంలో భాగంగా ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు పై ప్రజలను, స్థానికులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వాన్ని సహించేది లేదని, ప్రజల రక్షణే ప్రథమ కర్తవ్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎస్పీ గారు అధికారులకు స్పష్టం చేశారు. ఈ విస్తృత స్థాయి తనిఖీ మరియు సమీక్షా కార్యక్రమంలో ఆసిఫాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని డీఎస్పీ గారు, సీఐలు, ఎస్సైలు, మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Modernizing Police Lines: Upgrading Bihar’s Infrastructure
The Bihar Police force is undergoing a massive infrastructural transformation aimed at...
By Lokeshwari Panthadi 2026-07-04 09:41:47 0 248
Himachal Pradesh
Himachal Pradesh Boosts Sustainable Tourism Growth in 2026
Himachal Pradesh continues to strengthen its tourism sector by promoting sustainable and...
By Fathima Safa 2026-07-06 06:32:12 0 166
Andhra Pradesh
చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య: రోజా
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్...
By Pagadala Venkateswar 2026-01-06 07:35:25 0 310
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి తో కలిసి బీజేపీ...
By Sadaq Sadaq 2026-06-13 09:46:53 0 137
Andhra Pradesh
భారతీయ జనతా పార్టీ గణతంత్ర వేడుకలు
గణతంత్ర దినోత్సవం సందర్బంగా భారతీయజనతాపార్టీ NTR జిల్లా కార్యాలయము వద్ద జాతీయ జెండాను ఆవిస్కరించి...
By Rajini Kumari 2026-01-26 07:54:23 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com