హైడ్రా భూ వివాదంలో ఆర్మీ రక్షణకు హైకోర్టు ఆదేశం.|

0
114

● లోతుకుంట భూమి వివాదంలో కీలక ఆదేశాలు.

● కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనపై హైడ్రా కమిషనర్‌పై ఆగ్రహం.

● రేపటిలోగా 10 మంది ఆర్మీ అధికారుల పేర్లు సమర్పించాలని ఆదేశం.

మేడ్చల్ మల్కాజిగిరి , జూలై 23: మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంట సర్వే నంబర్లు 1, 2లో ఉన్న భూమి వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద భూమిలో యథాతథ స్థితిని కొనసాగించడంతో పాటు, కోర్టు ఆదేశాల అమలుకు భారత సైన్యం సహకారం తీసుకోవాలని ఆదేశించింది.

ఈ వ్యవహారంలో హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ కోర్టు ఆదేశాలను వరుసగా ఉల్లంఘించారని న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 

అవసరమైతే వివాదాస్పద భూమిలోకి ఎవరైనా కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే, ఆర్మీ వారిని అదుపులోకి తీసుకునేలా కూడా ఆదేశాలు ఇవ్వగలమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

భూమి రక్షణ కోసం విధులు నిర్వహించేందుకు 10 మంది ఆర్మీ అధికారుల పేర్లను పంపించాలని ఆర్మీ అధికారుల పేర్లను పంపించాలని ఆర్మీ బ్రిగేడియర్‌కు లేఖ రాయాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై ఈ విషయంలో నమ్మకం కోల్పోయామని, అందుకే ఈ అసాధారణ చర్యలు తీసుకోవాల్సి వస్తోందని కోర్టు పేర్కొంది.

లోతుకుంటలోని ఈ భూమికి సంబంధించి ప్రభుత్వం, శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ మధ్య న్యాయ వివాదం కొనసాగుతోంది. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
పేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల నియోజకవర్గం : లక్షెట్టీపేట్ మండల హన్మంతుపల్లి గ్రామానికి చెందిన D. లావణ్య ఆరోగ్య ఖర్చుల...
By Avunoori Mahesh 2026-04-13 14:54:14 0 222
Andhra Pradesh
వ్యవసాయాo లాభసాటిగా చేసేందుకు డ్రోన్ సేవలు పెంచాలి– కలెక్టర్.
అన్నమయ్యజిల్లా మదనపల్లి : కలెక్టర్ నిశాంత్ కుమార్, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్...
By Pagadala Venkateswar 2026-02-12 04:55:34 0 192
Andhra Pradesh
కార్మికులకు పుచ్చకాయలు పంపిణీ చేసిన జర్నలిస్ట్ సాంబ
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నందిగామ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీ నందిగామ...
By Patan Khuddus 2026-04-22 10:19:31 0 331
Legal
Supreme Court Dismissed Lalit Modi's Plea
The Supreme Court on Monday dismissed a plea by former cricket administrator Lalit Modi, who had...
By Bharat Aawaz 2025-07-03 08:45:12 0 3K
Andhra Pradesh
మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై హైకోర్టుని ఆశ్రయించిన వైసీపీ
మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై హైకోర్టుని ఆశ్రయించిన వైసీపీ ఏపీలోని 17 మెడికల్ కళాశాలలను పీపీపీ...
By Gadiyapudi Narendra 2026-01-07 10:18:49 0 279
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com