క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో ఆగష్టు 10న జైల్ భరో జయప్రదం చేయాలి - తుమ్మల రాజారెడ్డి సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు

0
222

 మంచిర్యాల పట్టణంలోని పూలె భవనంలో గురువారం రోజున సీఐటీయు, రైతు, వ్యవసాయ కార్మిక, ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, ఆదివాసీల ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు *హాజరైన ముఖ్య అతిధులు* మాట్లాడుతూ...కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం స్వాతంత్ర రాకముందే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి, దేశంలో పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు అనుకూలంగా వారికి లాభాలు చేకూర్చడం కోసమే లేబర్ కోడ్స్ ను బీజేపీ తెచ్చింది.కార్మికులకు కనీస వేతనం నిర్ణయం చేయలేదు.పని భద్రతను పని గంటలను పెంచింది. ఈపిఎఫ్, ఈఎస్ఐ ను ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్లకు అప్పచెప్పుతుంది. కార్మికుల మేడలకు లేబర్ కోడ్స్ ఉరితాళ్లుగా మారుస్తుంది, కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం అమెరికా బ్రిటన్, న్యూజిలాండ్ లతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద్దాలు చేసుకుంది. భారత వ్యవసాయ రంగంలోకి 32 దేశాలు నుండి దిగుమతులను ప్రోత్సహించడంతో జిరో సుంకంతో దిగుమతులు రావడంతో దేశియా వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గిపోయి రైతులు దివాళా తీస్తున్నారు.గత డిసెంబర్లో పత్తిపై ఉన్న 11 శాతం సుంకం తగ్గించి 40 లక్షల బేళ్ల పత్తిని అదనంగా దిగుమతి చేసుకోవడంతో దేశంలో పత్తి ధరలు పడిపోయాయ, వామపక్షాల పోరాట ఫలితంగా 2005లో “మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ చట్టం-2005" రూపొందింది. దీని ప్రకారం వ్యవసాయ కార్మికులకు సం॥లో 100 రోజుల పని కల్పించాలి. ప్రస్తుతం రోజుకు రూ.308/-లు చెల్లిస్తున్నారు. దేశంలో మొత్తం వ్యయంలో 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్రాలు భరించాలి. ఈ పథకానికి ఏటా 2.6 లక్షల కోట్లు పెంచాలని ఆందోళన జరుగుతుండగా కేంద్ర బిజెపి ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసింది. మహాత్మాగాంధీ పేరు తొలగించి "వికసిత్ భారత్ గ్రామ్ జి" పేరు (విబిజి రామ్)గా మార్పు చేయడమే కాక, రాష్ట్రాల వాటా 10 శాతం నుండి 40 శాతం నిధులను భరించాలని నిర్ణయించింది. సమైక్య పోరాటం ద్వారా ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాలి,గత పార్లమెంట్ సమావేశాల్లో “2025 విద్యుత్ సవరణ బిల్లు"గా ఆమోదించడం జరిగింది. ఈ చట్ట ప్రకారం ఇక నుండి విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ బాధ్యతలు కేంద్రం చూస్తుంది. స్మార్ట్ మీటర్లు పెట్టి టారిఫ్ ముందుగానే వసూలు చేస్తారు. ఉచిత విద్యుత్ రద్దు చేస్తారు,ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా విద్యుత్ను ప్రైవేటీకరించం, మోటర్లకు మీటర్ బిగించం అని చెబుతున్నప్పటికీ, ఈ సంక్షోభం నుండి బయట పడేందుకు భవిష్యత్తో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడం లేదా చార్జీలు పెట్టడం (పెంచడం) వంటి నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉన్నది. ఈ ప్రక్రియ క్రమేపి విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడానికి మార్గం సుగమం చేస్తుంది. దీనిని నిలువరించేందుకు ప్రజలు ఆందోళనలోకి రావాలి,దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆగస్టు 10న జరుగు జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు - రైతు - వ్యవసాయ కార్మిక సంఘం-ఆదివాసీ గిరిజన సంఘాల పిలుపునిస్తున్నాము.ఈ కార్యక్రమంలో దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి, గోమాస ప్రకాష్ సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు, సాంబారి వెంకటస్వామి, దాగం రాజారాం జిల్లా సహాయ కార్యదర్శులు, లక్ష్మణ్, రఫియా, దేవదాస్, రవి జిల్లా కమిటీ సభ్యులు, బోడేంకి చందు రైతు సంఘం జిల్లా కార్యదర్శి, కనికరపు అశోక్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, ఎర్మ పున్నం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి, శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్, డుర్కే మోహన్ కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి, బ్రహ్మయ్య సవిత జయ మదునమ్మ సరిత రబియా రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్ సందీప్ నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి కమిషనర్ హామీ
 🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 11వ...
By Chunarkar Jagadeesh 2026-06-30 16:49:25 0 267
Andhra Pradesh
📢 జనవరి 2026 పెన్షన్ పంపిణీ – ముఖ్య సమాచారం
✅ పెన్షన్ పంపిణీ తేదీ:➡️ జనవరి 1కు బదులుగా➡️ డిసెంబర్ 31, 2025 (ఉదయం 7:00 గంటల నుంచి) 🏠 గ్రామ /...
By SivaNagendra Annapareddy 2025-12-13 14:13:07 0 561
Telangana
బోనాల బాటలో బస్తీ బంధం..|
● అమ్మవారి దర్శనానికి రావాలని ఆహ్వానించిన బస్తీ నాయకులు ● కార్యక్రమంలో పాల్గొన్న పలువురు...
By Sidhu Maroju 2026-08-05 10:41:28 0 150
Andhra Pradesh
కాకినాడ బీచ్‌లో యువకుల గల్లంతు.. గాలింపు ముమ్మరం చేయాలన్న పవన్ కల్యాణ్.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని సముద్ర తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్ర...
By Pagadala Venkateswar 2026-08-24 04:51:54 0 135
Andhra Pradesh
మదనపల్లి: బేకరీ మాస్టర్ ఆత్మహత్యాయత్నం.
మదనపల్లిలో మంగళవారం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక 26 ఏళ్ల ఆనంద్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి...
By Pagadala Venkateswar 2026-02-10 07:39:31 0 193
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com