వర్షానికి ఇల్లు కూలిన బాధితురాలికి కొండంత భరోసా. ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తాం మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్
Posted 2026-07-23 11:23:40
0
244
🎤భారత్ ఆవాజ్ న్యూస్, ఆసిఫాబాద్ పట్టణంలోని మేకలవాడలో వర్షాల ధాటికి జూలాల లక్ష్మి అనే నిరుపేద మహిళ ఇంటి గోడలు కూలిపోయాయి. స్థానిక కౌన్సిలర్ జేబ షేక్ సమాచారంతో మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్, తహసిల్దార్ రియాజ్ అలీ, మున్సిపల్ కమిషనర్ అంజయ్య గురువారం క్షేత్రస్థాయిలో బాధితురాలి ఇల్లు పరిశీలించి ధైర్యం చెప్పారు.బాధితురాలి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఆమెకు 'ఇందిరమ్మ ఇల్లు' మంజూరయ్యే విధంగా శాయశక్తులా కృషి చేస్తామని మరియు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందేలా చూస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చిలువూరు వెంకటేశ్వర్లు, సాలం బీన్ అహ్మద్, బీఆర్ఎస్ నాయకులు సమద్, అధికారులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జ్యోతిరావు ఫూలే జయంతి : ఆల్వాల్ ప్రెస్ క్లబ్ భూమిపూజకు శ్రీకారం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: జ్యోతిరావు ఫూలే జయంతిని ఆల్వాల్ ల్లో ఘనంగా నిర్వహించారు. ఈ...
సురక్షిత ప్రయాణమే లక్ష్యం : మల్కాజిగిరి పోలీసుల వినూత్న హెల్మెట్ బ్యాంక్ .|
హైదరాబాద్ : ద్విచక్రవాహనదారుల ప్రాణాలను రక్షించాలనే లక్ష్యంతో మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్...
ఆంధ్రప్రదేశ్ పోలీసుల సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి:
సైబర్ క్రైమ్ అవగాహన - తిరుపతి: తిరుపతిలోని పాఠశాలలు, కళాశాలల్లో ఏపీ సైబర్ సెల్ ఆధ్వర్యంలో అవగాహన...
Tripura Expands Governance and Digital Services in 2026
Tripura is advancing digital governance by expanding online public services, improving...
పుంగనూరులో తాడుతో ఆటోను లాగిన సీపీఐ నాయకులు
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా మంగళవారం సిపిఐ నాయకులు ఆటో...