News Telangana లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నేత్ర శిబిరం Thalakokkula Sadanandam Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member 23/07/2026 · 3 min read 0 Comments 417 Views ఐ వి వై విద్యాసంస్థ లో ఉచిత నేత్ర శిబిరం, కంటి సంరక్షణతో పాటు దేశభక్తి సందేశం ... ఘనంగా ముగిసిన జాతీయ జెండా స్వీకరణ దినోత్సవ వేడుకలు ... కరీంనగర్ సీతారాంపూర్‌లోని (సీబీఎస్ఈ) విద్యాసంస్థలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర పరీక్షా శిబిరం వైభవంగా ముగిసింది. పాఠశాలలోని విద్యార్థులందరికీ ఉచితంగా నిర్వహించిన ఈ నేత్ర శిబిరంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ పసుల మహేష్ మాట్లాడుతూ, ప్రస్తుతం విద్యార్థులు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి డిజిటల్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కంటి సమస్యలు పెరుగుతున్నాయని, వాటిని ముందుగానే గుర్తించి నివారించేందుకు ఈ ఉచిత నేత్ర పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు పాఠశాల ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల ఆవరణం అసెంబ్లీ ప్రాంగణంలో జూలై 22 జాతీయ జెండా స్వీకరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రేడ్–3 నుండి గ్రేడ్–9 వరకు విద్యార్థులకు జాతీయ పతాకం గొప్పతనం తెలియజేసే ఉద్దేశంతో వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ పోటీలను పాఠశాల యాజమాన్యం నిర్వహించారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు లయన్స్ క్లబ్ ప్రతినిధులు శివకాంత్ రెడ్డి (ప్రెసిడెంట్), బట్టు వినోద్ (సెక్రటరీ), మెతుకు కృష్ణ చైతన్య, పాఠశాల చైర్మన్ పసుల మహేష్ చేతుల మీదుగా విద్యార్థులకు మెమొంటోలు ( జ్ఞాపికలు ) అందజేశారు . అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ సర్టిఫికెట్స్ అందజేశారు .ఇటువంటి కార్యక్రమాలు పాఠశాలలో ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థుల సృజనాత్మకత ,ఆత్మవిశ్వాసం పెరుగుతుందని లయన్స్ క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నారు .