కరువు రహిత దొనకొండే నా లక్ష్యం - డా గొట్టిపాటి లక్ష్మీ 

0
117

కరువు రహిత దొనకొండే నా లక్ష్యం - డా గొట్టిపాటి లక్ష్మీ 

దొనకొండ మండలంలో ‘జలధార – జలహారతి’ కార్యక్రమంలో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ పి. రాజబాబు , యువనేత డ్ కడియాల లలిత్ సాగర్ గార్లతో కలిసి పలు చెరువులను సందర్శించి, రుద్రసముద్రం చెరువు పూడికతీత పనులను పరిశీలించడం జరిగింది.

గుండ్లకమ్మ మిగులు జలాలను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులకు మళ్లించడం, 40 చెరువులను అభివృద్ధి చేయడం, భూగర్భ జలాలను పెంపొందించడం ద్వారా దొనకొండలో తాగు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నాం.ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ, కరువు వలసలు లేని సస్యశ్యామల దొనకొండను నిర్మించడమే మా లక్ష్యం.

చుట్టుపక్కల ఉన్న కాలువల నుంచి చెరువులను నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా చెరువుల్లోని పూడికను తొలగించి, ఆ మట్టిని తమ పొలాల్లో వినియోగించుకోవడం ద్వారా భూసారం, పంట దిగుబడిని పెంచుకోవచ్చని సూచించారు.

గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, స్థానిక టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారి విజ్ఞప్తితో దొనకొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, దొనకొండ మండల టీడీపీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు, ప్రజలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆఫీసులు సరే....నివాసాలెక్కడ?
మదనపల్లె కేంద్రంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లా యంత్రాగానికి కావాల్సిన ప్రభుత్వ కార్యాలయాల భవనాల...
By Pagadala Venkateswar 2026-01-08 10:38:27 0 243
Andhra Pradesh
మదనపల్లె: ఐచర్ లారీ బోల్తా.. 15 మంది కూలీలకు గాయాలు.
మదనపల్లె బైపాస్‌లో సోమవారం రాత్రి ఐచర్ లారీ డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ...
By Pagadala Venkateswar 2026-06-30 07:12:47 0 152
Andhra Pradesh
కదిరిలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
భారత్ అవాజ్ న్యూస్ :.కదిరి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్బూల్ మాట్లాడుతూ...
By Vinod Kumar 2026-09-11 14:08:05 0 184
Telangana
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.... వరంగల్ జిల్లా
 వరంగల్: ఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి.....   భారత్ అవాజ్ న్యూస్ :వరంగల్ జిల్లా...
By Gujile Ramu 2026-05-05 04:47:30 0 338
Rajasthan
The Sikar Nexus: CBI Dismantles the "Solver Gang"
Rajasthan’s Special Operations Group (SOG) has released a startling report today confirming...
By Dunna Jessicaruth 2026-05-15 06:11:13 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com