అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క. జోడేఘాట్‌లో అమరవీరుడు కొమురం భీం విగ్రహానికి ఘన నివాళులు. పలు గ్రామాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సర్‌ SSR ప్రక్రియపై క్షేత్రస్థాయి సమీక్ష.

0
251

కుమురంభీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: జల్-జంగల్-జమీన్ హక్కుల కోసం పోరాడి ప్రాణాలర్పించిన వీరుడు కొమురం భీం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పిలుపునిచ్చారు. కెరమెరి మండలంలోని జోడేఘాట్ పర్యటనకు విచ్చేసిన ఆమెకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె ఘనంగా నివాళులర్పించారు.అనంతరం జోడేఘాట్, పట్నాపూర్, బాబెఝరి, కొలాంగూడ గ్రామాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SSR) ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు, బీఎల్ఓలు, బీఎల్ఓ ఇన్చార్జీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆత్రం సుగుణక్క మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి నిశితంగా సర్వే చేయాలని, అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా సవరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్ల సర్వే ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వారి హక్కులను పరిరక్షించాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే స్పందించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీసీసీ కార్యాలయం వేదికగా మరియు క్షేత్రస్థాయిలో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఇందిరా ఫెలోషిప్ జిల్లా కో-ఆర్డినేటర్ కోవ ఇందిర, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సుజాయిద్ ఖాన్, పెందోర్ రాజేశ్వర్, సాదిక్ దేస్ముఖ్, దండుగుల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నూతన శుభాకాంక్షలు తెలిపిన: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు, జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన పార్టీ నాయకులకు ఆంగ్ల నూతన సంవత్సర...
By John Baji 2025-12-31 18:32:00 0 220
West Bengal
West Bengal Accelerates Industrial Investment Growth
West Bengal continues to strengthen its position as a key investment destination in eastern India...
By Fathima Safa 2026-06-25 09:49:56 0 111
Andhra Pradesh
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్: గూడూరు జంక్షన్ కష్టాలకు చెల్లుచీటి.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం చేకూర్చే కీలకమైన రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర...
By Pagadala Venkateswar 2026-08-20 06:17:22 0 105
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : పాపం చిన్న పాపమ్మ
పుంగనూరు నియోజకవర్గం, సదుం విద్య వనరుల కేంద్రం వద్ద వెంకటమ్మ అలియాస్ చిన్న పాపమ్మ (90) దయనీయ...
By Kothuru Murali 2026-03-06 11:32:56 0 203
Andhra Pradesh
మద్యం మత్తులో తమిళనాడు వ్యక్తి దారుణ హత్య.
అన్నమయ్య జిల్లా బోయకొండ అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో గాంధీ అనే తమిళనాడు వ్యక్తి...
By Pagadala Venkateswar 2026-04-07 03:50:59 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com