ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్: గూడూరు జంక్షన్ కష్టాలకు చెల్లుచీటి.

0
103

ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం చేకూర్చే కీలకమైన రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. గూడూరు-గుమ్మిడిపూండి మధ్య 90 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,229 కోట్లుగా నిర్ణయించారు.

 

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం డబుల్ లైన్‌గా ఉన్న ఈ మార్గాన్ని నాలుగు లైన్లుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి, మరిన్ని ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపేందుకు వీలవుతుందని వివరించారు. దేశంలో అత్యంత రద్దీగా ఉండే చెన్నై-కోల్‌కతా, ఢిల్లీ-చెన్నై మార్గాలతో పాటు వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఈ ప్రాజెక్టు ఎంతో కీలకం కానుంది.

 

ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించడంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తిరుపతి ఎంపీ గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఈ అదనపు ట్రాక్‌లు ప్రాంతీయ అభివృద్ధికి, ప్రగతికి బాటలు వేస్తాయని పవన్ కల్యాణ్ పేర్కొంటూ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపినందుకు రైల్వే మంత్రికి ఎంపీ గురుమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.

 

ప్రాజెక్టుతో చేకూరే ప్రయోజనాలు

 

ఈ ప్రాజెక్టు పూర్తయితే గూడూరు జంక్షన్‌లో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. చెన్నై, విజయవాడ, తిరుపతి వైపు వెళ్లే రైళ్ల రాకపోకలు సులభతరం అవుతాయి. ముఖ్యంగా పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం, శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్, కృష్ణపట్నం పోర్టు, శ్రీసిటీ వంటి కీలక ప్రాంతాలకు అనుసంధానం మెరుగుపడుతుంది. ప్రాజెక్టులో భాగంగా స్వర్ణముఖి నదిపై 360 మీటర్ల మెగా బ్రిడ్జితో సహా 21 ప్రధాన వంతెనలు, 127 చిన్న వంతెనలు నిర్మించనున్నారు.

Search
Categories
Read More
BMA
Reader-Funded Power: The Strength of Independence
The ultimate strength of a newsroom is determined by who pays the bills. The Indian press is...
By JoinBMA 2026-08-21 10:31:01 0 59
Puducherry
Puducherry Promotes Clean Energy and Electric Mobility
Puducherry is accelerating its transition toward clean energy and sustainable transportation by...
By Fathima Safa 2026-06-29 08:38:39 0 136
Telangana
త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్య్రం కుమురం భీం ఆసిఫాబాద్ వేడుకల్లో డెప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్
🎤ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్య్ర...
By Chunarkar Jagadeesh 2026-08-15 11:12:39 0 181
Kerala
Rapper Vedan arrested in Kerala, subsequent amount of ganja seized from flat
New Delhi:Troubles have increased for rapper Vedan as a narcotic substance was recovered from his...
By BMA ADMIN 2025-05-20 05:23:24 0 2K
Andhra Pradesh
మదనపల్లి: భోగిమంటల్లో జీవోలు దగ్ధం చేసిన సీపీఐ
రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్లు 107, 108, 590ను...
By Pagadala Venkateswar 2026-01-15 07:04:20 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com