జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై హైకోర్టులో పిటిషన్.|

0
200

● వార్డుల పునర్విభజన చట్టవిరుద్ధమని ఆరోపణ.

● విచారణ ఆగస్టు 11కు వాయిదా.

హైదరాబాద్, జులై 20 : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 

వార్డుల సరిహద్దులను నిబంధనల ప్రకారం తిరిగి నిర్ధారించే వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కోర్టును కోరారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వార్డుల పునర్విభజన చట్టవిరుద్ధంగా జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

1996 జీవో నంబర్ 570లోని రూల్-5 ప్రకారం డీలిమిటేషన్ జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని నిర్వహించాల్సి ఉండగా, ఆ నిబంధనలను పాటించలేదని వాదించారు. 

అలాగే తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం–2019లోని సెక్షన్-6 నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ప్రభుత్వం, పిటిషనర్ల తరఫు వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది.

#Sidhumaroju

Search
Categories
Read More
Bharat Aawaz
“When One Voice Questions, Many Lives Change”
Hyderabad - In every street of India, in every silent corner of our society, there's a question...
By Bharat Aawaz 2025-07-24 06:33:01 0 1K
Telangana
అత్యంత వైభవంగా కాజీపల్లి రేణుక ఎల్లమ్మ తల్లి జాతర
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లిలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర అత్యంత వైభవంగా,...
By Ponnala Srinivasrao 2026-03-17 13:13:46 0 276
SURAKSHA
పోలీస్ శిక్షణతో యువతకు ఉపాధి - AP స్కిల్ డెవలప్మెంట్ మిషన్
నిరుద్యోగ యువతకు చేయూత ఇచ్చేందుకు AP పోలీస్ "యువశక్తి" స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నడుపుతుంది....
By Kalaga Sailaja 2026-07-01 10:09:26 0 88
Andhra Pradesh
ఏపీలో నేడు 51 మండలాల్లో తీవ్రవాడగలరు
*ఏపీలో నేడు 51 మండలాల్లో తీవ్ర వడగాలులు*    అమరావతి :   ఏపీలో ఎండల తీవ్రత...
By Rajini Kumari 2026-04-13 08:06:22 0 181
Andhra Pradesh
APPSC గ్రూప్–1 మరియు గ్రూప్–2 పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన పోలీస్ శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు
APPSC గ్రూప్–1 మరియు గ్రూప్–2 పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన పోలీస్ శాఖ సిబ్బందిని...
By Chennaiah Kati 2026-02-03 18:07:28 0 240
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com