ఓటును రక్షించుకోవడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత

1
528

హుజూర్‌నగర్  / భారత్ అవాజ్ :

దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపట్టిన SIR (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును రక్షించుకునేందుకు తప్పనిసరిగా SIR ఫారాన్ని పూర్తి చేసి సంబంధిత బూత్ లెవల్ అధికారి (BLO)కి అందజేయాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు.

హుజూర్ నగర్ 219 పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 70 శాతం SIR ఫారాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా ఫారాలు సమర్పించని ఓటర్లు ఆలస్యం చేయకుండా వెంటనే SIR ఫారాన్ని నింపి స్థానిక BLOకు అందజేసి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు.

 

ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ఆకుల రాము, యువ న్యాయవాది చిట్టిపోతుల రమేష్, BLO ఆకుల రజని, RP పులి సుధాలు 219 పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా SIR ప్రక్రియలో పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని వారు కోరారు.

Search
Categories
Read More
Lakshdweep
Coastal and Marine Conservation Efforts in Lakshadweep
Coastal and marine conservation has been a key priority in Lakshadweep due to its rich...
By Fathima Safa 2026-06-18 09:11:01 0 351
Andhra Pradesh
మదనపల్లె: దారికాసి పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి.
శుక్రవారం మదనపల్లెలో పారిశుద్ధ్య కార్మికురాలిపై దారికాసి దాడి జరిగింది. కుమారపురానికి చెందిన...
By Pagadala Venkateswar 2026-05-22 12:34:00 0 139
Andhra Pradesh
నాలుగో రోజుకు చేరిన అంగన్‌వాడీల రిలే నిరాహార దీక్షలు.
మదనపల్లెలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను...
By Pagadala Venkateswar 2026-02-27 04:09:21 0 164
Telangana
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం శాంతియుత దీక్షలు - సంఘీభావం తెలిపిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత దీక్షలు అల్వాల్ జెఎసి ప్రాంగణంలో...
By Sidhu Maroju 2025-06-30 14:33:19 0 1K
Andhra Pradesh
St.ann's కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజ్ చేస్తున్న JNTUK కాకినాడ ఇంటర్ కాలేజీ గేట్ క్రికెట్ (Men) టోర్నమెంట్ సెలక్షన్ ట్రైల్స్ 2025-2026 టోర్నమెంట్ ప్రారంభోత్సవం
చీరాల: St.ann's కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజ్ చేస్తున్న JNTUK కాకినాడ ఇంటర్...
By Gadiyapudi Narendra 2026-01-19 14:35:50 0 501
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com