గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు నేడు – హుజూర్‌నగర్‌లో కేక్ కటింగ్, మెగా రక్తదాన శిబిరం

0
404

హుజూర్‌నగర్ / భారత్ అవాజ్ :

 

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని హుజూర్‌నగర్ పట్టణంలో శనివారం (జూలై 18) ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగదీష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉదయం 9:30 గంటలకు హుజూర్‌నగర్ అడ్డరోడ్డులో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం టౌన్ హాల్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రస్తుతం సూర్యాపేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

 

ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మాజీ జెడ్పీటీసీ, హుజూర్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు డా. కొప్పుల సైదిరెడ్డి పిలుపునిచ్చారు.

 

రక్తదానం మహాదానమని, ఈ సేవా కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని ప్రాణదాతలుగా నిలవాలని ఆయన కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం: ఏర్పాట్లు ముమ్మరం.
బుధవారం మదనపల్లెలోని శ్రీకృష్ణ కళ్యాణమండపంలో జరగనున్న బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పులి...
By Pagadala Venkateswar 2026-06-17 03:52:18 0 115
SURAKSHA
Chitra, IAS: Championing People-Centric Governance in Kerala
The Journey Begins "The true strength of governance lies in its ability to...
By Fathima Safa 2026-07-15 13:01:52 0 194
Andhra Pradesh
మహాశివరాత్రిని పురస్కరించుకొని దేవాలయాల వద్ద తీసుకోవలసిన భద్రత చర్యల....
బాపట్ల జిల్లా: మహాశివరాత్రిని పురస్కరించుకొని దేవాలయాల వద్ద తీసుకోవలసిన భద్రత చర్యల గురించి...
By Gadiyapudi Narendra 2026-02-05 16:50:40 0 217
Andhra Pradesh
పుంగనూరు: బోయకొండ గంగమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యేలు
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని దిగువపల్లి శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారిని...
By Kothuru Murali 2026-04-04 06:13:48 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com