సైన్స్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి: జేవీవీ రాష్ట్ర సభ్యులు షేక్ జాఫర్

0
285

భారత్ అవాజ్ | హుజూర్‌నగర్

 

విద్యార్థులు చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని సైన్స్ అంశాలపై అవగాహన పెంచుకోవాలని జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర సభ్యులు షేక్ జాఫర్ అన్నారు.

 

స్థానిక తెలంగాణ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సీహెచ్ రమేష్ అధ్యక్షతన విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలపై అభిరుచి, అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేవీవీ రాష్ట్ర సభ్యులు షేక్ జాఫర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కలకుంట్ల సైదులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా షేక్ జాఫర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ చుట్టూ జరిగే ప్రతి అంశాన్ని శాస్త్రీయ కోణంలో పరిశీలించాలని సూచించారు. ఏదైనా విషయంపై దృఢమైన నిర్ణయానికి రావాలంటే పలుమార్లు పరిశీలించి, ప్రయోగాల ద్వారా రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు.

 

ప్రస్తుత సమాజ మార్పులకు అనుగుణంగా శాస్త్ర విజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతోందని, భావి భారత పౌరులుగా విద్యార్థులు సైన్స్‌పై అవగాహన పెంచుకుని శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

 

అనంతరం వివిధ సులభమైన సైన్స్ ప్రయోగాలను ప్రదర్శించి విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించారు. విద్యార్థులు ప్రయోగాలను ఆసక్తిగా వీక్షించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

 

ఈ కార్యక్రమంలో హాస్టల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

References

Love
1
Search
Categories
Read More
Telangana
తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ అంతా రగిలిపోతుంది
తెలంగాణ రాష్ట్ర విభజనను ఇండియా – పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు...
By Ponnala Srinivasrao 2026-04-19 01:15:22 0 153
Andhra Pradesh
మహిళల మాన ప్రాణాలకు భద్రత లేదా. - జిల్లాలో శాంతిభద్రతలు కరువు. - కూటమి పాలనలో రక్షణ లేని రాష్ట్రంగా, ఆంధ్ర రాష్ట్రం - పూజిత.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా...
By Ratna Sekhar 2026-03-11 07:09:39 0 682
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మున్సిపల్ కమిషనర్‌కు మున్సిపల్ అధ్యక్షుడు ముజీబ్ వినతిపత్రం అందజేశారు.
Madanapalle: పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ మదనపల్లె...
By Pagadala Venkateswar 2026-07-21 09:48:26 0 115
BMA
Local News At Risk: The Chilling Echo Chamber Threat
In Dimapur, Henlly Phom Odyuo, President of the Dimapur Press Club, recently...
By JoinBMA 2026-08-19 05:04:59 0 170
SURAKSHA
B. Sandhya IPS: A Legacy of Courage and Compassion in Policing
The Journey Begins "Leadership is measured not by authority, but by the trust you build among...
By Fathima Safa 2026-07-16 05:43:04 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com