అంగవైకల్యం ఆత్మగౌరవానికి అడ్డుకాకూడదు.. విభిన్న ప్రతిభావంతులకు అండగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు

0
91

అంగవైకల్యం ఆత్మగౌరవానికి అడ్డుకాకూడదు.. విభిన్న ప్రతిభావంతులకు అండగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు

విభిన్న ప్రతిభావంతులు స్వయం ఆధారిత జీవితం గడపాలని, అంగవైకల్యం వారి ఆత్మగౌరవానికి అడ్డంకిగా మారకూడదనే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు శ్రీమతి గళ్ళా మాధవి గారు అన్నారు.

గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జెండర్లు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మూడు చక్రాల మోటార్ స్కూటర్లు, ఫోల్డబుల్ వీల్‌చైర్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరియు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ... ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 10 చొప్పున మొత్తం 1,750 మోటార్ వెహికల్స్‌ను అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు అందజేస్తోందని తెలిపారు. అంగవైకల్యం కారణంగా ఎవరూ ఇతరులపై ఆధారపడి జీవించాల్సిన అవసరం లేకుండా స్వతంత్రంగా జీవించేందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందన్నారు.

ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, వివిధ రకాల వైకల్యాలతో బాధపడుతున్న వారిని డిసేబుల్డ్ కేటగిరీలో చేర్చి సంక్షేమ పథకాలు వర్తింపజేయడం వంటి చర్యలు చేపట్టిందన్నారు.

విభిన్న ప్రతిభావంతులకు మాత్రమే కాకుండా వారికి సహాయకులుగా ఉండే వ్యక్తులకు కూడా ఉచిత బస్సు ప్రయాణంలో 50 శాతం రాయితీ కల్పించడం ప్రభుత్వం సామాజిక బాధ్యతకు నిదర్శనమని తెలిపారు. అదేవిధంగా కార్పొరేషన్ల ద్వారా ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాల కోసం రుణాలు, సొంత ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల వరకు రుణ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచినట్లు వివరించారు.

కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి చొరవతో ఇటీవల సీఎస్ఆర్ నిధుల ద్వారా కూడా పలువురు విభిన్న ప్రతిభావంతులకు మోటార్ వాహనాలు అందించిన విషయాన్ని ఎమ్మెల్యే గారు గుర్తుచేశారు. భవిష్యత్తులో అర్హులైన లబ్ధిదారులకు స్థలాల కేటాయింపుపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తోందని వెల్లడించారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి కేటాయించిన 10 మోటార్ వాహనాలలో అధిక సంఖ్యలో మహిళలు లబ్ధిదారులుగా ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ, శారీరక ఇబ్బందులను అధిగమించి జీవనోపాధి కోసం శ్రమిస్తున్న మహిళలకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఇద్దరు పిల్లలను పోషిస్తున్న తల్లులు సహా పలువురు మహిళలు ఈ వాహనాలను పొందడం ద్వారా తమ జీవితాల్లో కొత్త ఆశలు చిగురించాయని పేర్కొన్నారు.

లబ్ధిదారుల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందమే తమకు మరింత సేవ చేయాలనే స్ఫూర్తిని ఇస్తోందని, విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూనే ఉంటుందని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రెండు రోజుల పాటు శ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవ ఆహ్వానం కొత్తూరు మురళి
చిత్తూరు జిల్లా రొంపిచెర్ల గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మవారి జాతర మహోత్సవం 09-05-2026 మరియు...
By Kothuru Murali 2026-05-07 12:25:22 0 155
Arunachal Pradesh
Digital Shields: Arunachal Overhauls ILP with QR-Codes
In a landmark move to bolster state security and preserve indigenous rights, the Arunachal...
By Dunna Jessicaruth 2026-05-15 06:52:11 0 107
Telangana
బోనాల పండుగ పంపిణీలో చెక్కుల వివాదం- కాలనీవాసులపై అయినా కేసులను పున పరిశీలించండి; ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే శ్రీ...
By Sidhu Maroju 2025-11-18 11:18:46 0 249
Telangana
"దళిత సేవకు గౌరవం… క్రీడా ప్రతిభకు కీర్తి — విజేతలను సత్కరించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సామాజిక సేవకు దక్కిన గౌరవం… క్రీడా ప్రతిభతో సాధించిన జాతీయ...
By Sidhu Maroju 2026-05-24 08:05:30 0 219
Andhra Pradesh
పెద్దాపురం కాపు కళ్యాణమండపానికి రూ.75 లక్షలు మంజూరు – ఎంపీ ఉదయ్ శ్రీనివాస్
పెద్దాపురం పట్టణంలో గత 15 ఏళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన కాపు కళ్యాణమండపం నిర్మాణానికి శుభవార్త...
By Ratna Sekhar 2026-02-19 19:10:42 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com