Madanapalle: మదనపల్లె మండలం కోళ్లబైలు గ్రామంలో తాగునీటి సమస్యను కురువంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి పరిష్కరించారు.

0
92

Madanapalle: మదనపల్లె మండలం కోళ్లబైలు గ్రామంలో బోరు మోటర్ కాలిపోవడంతో గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. సమస్యను సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు కురువంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతిని ఆశ్రయించారు.

 

తన పంచాయతీ పరిధిలోకి కోళ్లబైలు గ్రామం రాకపోయినా, గ్రామ ప్రజల ఇబ్బందులను గుర్తించిన చలపతి వెంటనే స్పందించి, తన సొంత ఖర్చులతో కాలిపోయిన బోరు మోటర్‌ను మరమ్మతు చేయించి తాగునీటి సరఫరా పునరుద్ధరించారు.

 

దీంతో గ్రామ ప్రజలు తాగునీటి సమస్య నుంచి ఉపశమనం పొందారు. అంతేకాకుండా, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా సుమారు రూ.50 వేల వ్యయంతో కొత్త పైప్‌లైన్‌తో పాటు నీటి నిల్వ ట్యాంకును కూడా ఏర్పాటు చేయిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు త్వరలోనే చేపడతామని తెలిపారు.

 

తమ సమస్యను వెంటనే పరిష్కరించి, శాశ్వత పరిష్కారం దిశగా కూడా ముందుకొచ్చిన మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయన సేవాభావం, మానవత్వాన్ని అభినందించారు.

Search
Categories
Read More
Telangana
విద్యార్థుల భవిష్యత్తుకు 'గరుగు' భరోసా
Bharath aawaz today news మొయినాబాద్, మార్చి 27: విద్యార్థుల విద్యా భవిష్యత్తు దెబ్బతినకూడదనే...
By Veeresh Kumar 2026-03-27 00:58:55 0 563
Andhra Pradesh
మదనపల్లె: పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా NTR జయంతి వేడుకలు.
మదనపల్లె పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)...
By Pagadala Venkateswar 2026-05-29 05:20:12 0 100
Andhra Pradesh
బాలిక దారుణ హత్య : పోలీసుల అదుపులో నిందితుడు.
మదనపల్లె పట్టణంలో నీరుగట్టువారిపల్లి రామిరెడ్డి లే అవుట్‌లో బాలిక దారుణ హత్యకు గురైన...
By Pagadala Venkateswar 2026-02-17 06:14:12 0 205
Andhra Pradesh
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక.
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (UFBU) పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో...
By Pagadala Venkateswar 2026-01-27 09:08:53 0 212
Andhra Pradesh
పులివెందుల ZPTC ఉప ఎన్నికలు – MLA ఎన్నికల కంటే కఠినమైన భద్రత
ఆంధ్రప్రదేశ్‌ - పులివెందులలో జరగనున్న జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూయెన్సీ (ZPTC) ఉప...
By Bharat Aawaz 2025-08-11 18:22:55 0 808
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com