Madanapalle: మదనపల్లె బస్టాండ్‌లో 48 గ్రాముల బంగారు నెక్లెస్ పోగొట్టుకున్న బాధితురాలు. వెంటనే స్పందించి గంటలోపే నెక్లెస్‌ను గుర్తించి అప్పగించిన 2 టౌన్ పోలీసులు.

0
92

మదనపల్లె: మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్‌లో పోగొట్టుకున్న సుమారు 48 గ్రాముల బంగారు నెక్లెస్‌ను మదనపల్లె 2 టౌన్ పోలీసులు చాకచక్యంగా గుర్తించి బాధితురాలికి అప్పగించారు. ఈ ఘటనలో పోలీసులు వేగంగా స్పందించి తమ సమయస్ఫూర్తిని చాటుకున్నారు. సత్యసాయి జిల్లా కదిరి మండలం చౌకుపాలెంకు చెందిన ఖాదరబీ తన భర్త ఫక్రుద్దీన్‌తో కలిసి కలికిరిలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు కదిరి నుంచి బస్సులో మదనపల్లెకు చేరుకున్నారు. అనంతరం కలికిరి బస్సు కోసం ఆర్టీసీ బస్టాండ్‌లో వేచి ఉండగా, ఆమె మెడలో ఉన్న బంగారు నెక్లెస్ అనుకోకుండా పోగొట్టుకుంది. విషయం తెలుసుకున్న బాధితురాలు వెంటనే మదనపల్లె 2 టౌన్ పోలీసులను ఆశ్రయించగా, వారు వెంటనే చర్యలు చేపట్టి బస్టాండ్ పరిసరాల్లో గాలింపు నిర్వహించి, గంటలోపే 48 గ్రాముల బంగారు నెక్లెస్‌ను గుర్తించారు. అనంతరం బాధితురాలిని పిలిపించి ధృవీకరించి ఆమెకు నెక్లెస్‌ను అప్పగించారు.

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
బొబ్బిలి కమిషనర్ సూచనలు
బొబ్బిలి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు మున్సిపల్ ఛైర్మన్ శరత్ బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే...
By Boiena Rajesh 2026-03-12 15:30:56 0 267
SURAKSHA
Ashwani Kumar, IAS: Driving Progressive Governance Forward
The Journey Begins Behind every efficient government is a team of dedicated...
By Fathima Safa 2026-07-27 12:00:21 0 211
Telangana
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై స్పందించి నా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై రాష్ట్ర...
By Ponnala Srinivasrao 2026-05-12 00:48:41 0 155
Telangana
బోనాల పండుగ పంపిణీలో చెక్కుల వివాదం- కాలనీవాసులపై అయినా కేసులను పున పరిశీలించండి; ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే శ్రీ...
By Sidhu Maroju 2025-11-18 11:18:46 0 250
SURAKSHA
112: Your Unified Emergency Response
The 112 emergency helpline serves as a vital, integrated lifeline for citizens, ensuring rapid...
By Kalaga Sailaja 2026-06-26 11:54:21 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com