Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఎస్పీ ధీరజ్ కునుబిల్లి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

0
102

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. బీసెంట్ సర్కిల్ నుంచి సంఘం ఫంక్షన్ హాల్ వరకు కాలినడకన వెళ్లి ట్రాఫిక్ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.

 

ఈ సందర్భంగా రహదారులకు ఇరువైపులా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న దుకాణాల ఆక్రమణలు, తోపుడు బండ్లను వెంటనే తొలగించుకోవాలని వ్యాపారులకు సూచించారు. పట్టణంలో ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించేందుకు పోలీసు శాఖ చేపడుతున్న చర్యలకు ప్రజలు, వ్యాపారులు పూర్తి సహకారం అందించాలని కోరారు.

 

అలాగే వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలపకుండా, మున్సిపాలిటీ నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలిపేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించడం ద్వారా రద్దీని తగ్గించి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.

 

ఈ తనిఖీలలో ట్రాఫిక్ సీఐ గురునాథ్, వన్‌టౌన్ సీఐ రాజారెడ్డి, ఎస్ఐ గాయత్రి, ఆర్ఎస్ఐ శ్రీనివాస్‌తో పాటు మున్సిపల్ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Shri Ketan Bansal, IPS: Leading Smart Policing with Integrity
A dynamic 2016-batch AGMUT cadre IPS officer known for technology-driven policing, cybercrime...
By Lokeshwari Panthadi 2026-07-20 12:46:27 0 214
Andhra Pradesh
ప్రగతి బాటలో పల్లెలు
ప్రగతి బాటలో పల్లెలు.   పరుగులు పెడుతున్న అభివృద్ధి.   -మైలవరం ఎమ్మెల్యే వసంత...
By Rajini Kumari 2026-04-17 15:17:38 0 151
Andhra Pradesh
మదనపల్లెలో ఘర్షణ.. 15 మందిపై కేసు నమోదు.
మదనపల్లె మండలంలోని కోళ్లబైలు గ్రామం జగనన్న కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణపై ఇరువర్గాలకు...
By Pagadala Venkateswar 2026-03-24 03:28:09 0 214
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద "జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి గారి, జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి" డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
🎤కొమురం బీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): తెలంగాణ రాష్ట్ర...
By Chunarkar Jagadeesh 2026-05-23 01:43:53 0 738
Telangana
Central election commission gives green signal for kavitha new party
“తెలంగాణ రక్షణ సేన”కు సీఈసీ గ్రీన్ సిగ్నల్.. కవితకు అధికారిక అనుమతి   కేంద్ర...
By G k Nookala 2026-04-30 10:37:58 0 337
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com