Yesteryear legendary singer s Janaki passed away

0
151

ప్రముఖ గాయని ఎస్. జానకి గారి మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో జానకి గారు తన గళమాధుర్యంతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు. 

 

▪️అనేక చిత్రాల్లో పాత్ర సన్నివేశాలకు, సందర్భాలకు అనుగుణంగా నవరసాలను పలికిస్తూ పాడిన పాటలు శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాయని పేర్కొన్నారు. వారు తెలుగు వారు కావడం తెలుగు ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. 

 

▪️తెలుగు, తమిళం, హిందీతో పాటుగా మొత్తం 17 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి ఎన్నో జాతీయ పురస్కారాలు అందుకున్నారని గుర్తుచేశారు. జానకమ్మ గారి మరణం భారతీయ చలన చిత్ర పరిశ్రమకే కాకుండా కోట్లాది సంగీతాభిమానులకు తీరని లోటు అని పేర్కొన్నారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ జానకి గారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి గారు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రేపు కోల్‌కతాకు సీఎం చంద్రబాబు... బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి హాజరు.
రేపు ఉదయం విజయవాడ నుంచి కోల్‌కతాకు బయల్దేరనున్న ముఖ్యమంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,...
By Pagadala Venkateswar 2026-05-08 05:40:55 0 140
Andhra Pradesh
వరస గా జన్మ దినోత్సవం లు
విశాఖ దక్షిణ నియోజక వర్గం ఎంఎల్ఏ కు జన్మదినోత్సవాలు జరుగుతున్నాయి ఏవి యన్ కాలేజీ పరిధిలో గల...
By Mobbu Venkatramana 2026-02-06 13:11:01 0 394
Andhra Pradesh
తునికి ఆకు బోనస్ వెంటనే చెల్లించాలి: చింతూరు సిపిఎం కార్యకర్తల నిరసన!
2020-21 సంవత్సరానికి సంబంధించిన తునికాకు బోనస్ డబ్బులు ఇప్పటికీ కార్మికుల ఖాతాల్లో పడలేదు. దీనిపై...
By Shyamala Yadagiri 2026-06-02 06:45:34 0 233
Andhra Pradesh
ఆటో కార్మికుల సమ్మె
విశాఖ పట్నంలోని ఏ వియన్ కాలేజీ రోడ్డు అంబేద్కర్ విగ్రహ నడి కూడలిలో ఈ రోజు దేశ సమ్మె కారణంగా ఆటో...
By Mobbu Venkatramana 2026-02-12 16:18:39 0 353
Telangana
రామాయంపేట: హక్కులపై అవగాహన కలిగి ఉండాలి'
రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో గురువారం 'పౌరహక్కుల దినోత్సవం' నిర్వహించారు. సర్పంచ్ తార్యా...
By Katiyala JeevanRaj 2026-04-30 08:06:17 0 365
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com