మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు

0
128

మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చు : జిల్లా ఎస్పీ గారు

మార్కాపురంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణతో పాటు పరిసర ప్రాంతాల్లో మొత్తం 16 హై-రిజల్యూషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కెమెరాల ద్వారా బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో జరిగే బ్యాగుల దొంగతనాలు, ద్విచక్ర వాహనాల చోరీలు, మొబైల్ ఫోన్ చోరీలు తదితర నేరాలను వేగంగా గుర్తించి, నిందితులను గుర్తించడంతో పాటు దొంగిలించబడిన వస్తువులను రికవరీ చేయడంలో ఎంతో ఉపయోగపడతాయన్నారు.

ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు నేరాల నియంత్రణ, నేరాల ఛేదనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ప్రజలు కూడా తమ ఇళ్లు, వ్యాపార సంస్థలు, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు, ప్రజల భద్రత కోసం సీసీ కెమెరా వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలు గుర్తించిన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవి నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మార్కాపురంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపిన మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు, మార్కాపురం సీఐ అల్తాఫ్ హుసేన్, మార్కాపురం ఎస్‌ఐలను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు.
 అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ చల్లా...
By Pagadala Venkateswar 2026-09-13 07:15:24 0 74
Telangana
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
By Ponnala Srinivasrao 2026-06-24 01:37:44 0 167
SURAKSHA
: Bengaluru Police Plant Trees For Green Bengaluru
 As part of environmental protection, Bengaluru Police today led a massive tree plantation...
By Kalaga Sailaja 2026-07-06 06:43:59 0 131
Bihar
Bihar's New Colleges Delayed: Saat Nischay-3 Faces Hurdles
The Bihar government's ambitious plan to launch 211 new degree colleges under the 'Saat...
By Lokeshwari Panthadi 2026-07-02 03:56:58 0 78
Telangana
జిల్లా ప్రజలకు కలెక్టర్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు;
నిర్మల్ జిల్లా ప్రజలకు, అధికారులకు కలెక్టర్ అభిలాష అభినవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ...
By Mittapelli Saketh 2026-01-01 11:12:20 0 669
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com