బాబు జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే.|

0
131

"బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్న మర్రి రాజశేఖర్ రెడ్డి"

మేడ్చల్ మల్కాజ్‌గిరి,,: జూలై 6: భారత మాజీ ఉప ప్రధానమంత్రి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ వర్ధంతి సందర్భంగా మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన మహానేత అని కొనియాడారు. 

బడుగు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణతో పాటు దేశ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి, తులసి సురేష్, సాయిసాగర్, ప్రభాకర్ రెడ్డి, బాలకృష్ణ, గౌస్ ఇమ్రాన్, సాయి గౌడ్, రాజు, సురేష్ జమీందార్, ముత్యాలు, బంటి తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు లు
నేడు మెదక్ ఉమ్మడి  జిల్లాలో జరా సంఘం మండల్ పరిధి గ్రామంలో  జొన్న మొక్కజొన్న మరియు ఇతర...
By Alige Srinivas 2026-03-17 13:10:41 0 548
Telangana
ఘనంగా 134 డివిజన్ కార్పొరేటర్ జన్మదిన వేడుకలు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన...
By Sidhu Maroju 2025-12-02 15:20:44 0 307
Telangana
పెద్దపల్లి : గోదావరిఖనిలో స్కూల్ టీచర్ మృతి..!
గోదావరిఖని అడ్డగుంటపల్లిలో శనివారం రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు స్కూల్ టీచర్ వెన్నెల (30) దుర్మరణం...
By Sunka Santhosh 2026-04-18 06:54:52 0 254
Andhra Pradesh
పుంగనూరు ఐటీఐకి నూతన ప్రిన్సిపాల్‌గా సురేష్ కుమార్ బాధ్యతలు
పుంగనూరు ప్రభుత్వ ఐటీఐకి నూతన ప్రిన్సిపాల్‌గా సి. సురేష్ కుమార్ బుధవారం బాధ్యతలు...
By Kothuru Murali 2026-06-04 14:33:52 0 127
Maharashtra
NEET UG Paper Leak: CBI Arrests Prominent Coaching Centre Founder in Latur
In a major crackdown on educational malpractice, the Central Bureau of Investigation (CBI) today...
By Dunna Jessicaruth 2026-05-18 10:09:30 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com