Bharat Aawaz

మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో విషాద ఘటన

Ponnala Srinivasrao
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
180
Views

మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కలచివేసింది.

‎వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్‌ (32), ఆయన భార్య శిరీష (28) గత కొంతకాలంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.

‎అప్పులను తీర్చే మార్గం కనిపించకపోవడంతో గురువారం రాత్రి ఘట్‌కేసర్‌ సమీపంలోని రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి వేగంగా వస్తున్న రైలు కిందపడి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

‎సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల వద్ద లభించిన ఆధారాల ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటన రెండు కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది