వ్యవసాయ కరెంట్ ట్రాన్స్ఫారం దొంగతనం

0
282

చీరాల మండలం పిట్టువారి పాలెం – గవినివారి పాలెం మధ్య ఉన్న వ్యవసాయ పొలాలకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్‌ను అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దొంగిలించిన ఘటన స్థానిక రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనం కారణంగా ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వేరుశనగ పంటలకు నీరందించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, అలాగే దొంగలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను రైతులు కోరుతున్నారు. పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Search
Categories
Read More
SURAKSHA
Uday Kumar IAS: Transforming Healthcare Through Governance
A dedicated Telangana IAS officer whose leadership in public healthcare, governance, and...
By Lokeshwari Panthadi 2026-07-15 10:12:34 0 233
Telangana
కీ, శే, కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్కు అవార్డు అందించిన : గవర్నర్
 మంచిర్యాల జిల్లా : కీ,శే,కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ కు గవర్నర్ శివ్ ప్రతాప్...
By Avunoori Mahesh 2026-06-14 11:24:41 0 247
Telangana
యుద్ధాన్ని మించిన విధ్వంసాన్ని సృష్టించా.. హైడ్రాతో ప్రజల్ని వణికించిన.. సీఎం రేవంత్‌రెడ్డి
అది బెంగళూరు వేదిక.. అక్కడ జరుగుతున్నది జాతీయ దినపత్రిక ‘ది హిందూ’ నిర్వహించిన...
By Ponnala Srinivasrao 2026-06-09 12:56:27 0 164
Andhra Pradesh
నందవరం మండల బిజెపి నేతలు లలిత జైన్ గారిని కలిశారు
నందవరం మండలం బిజెపి నేతలు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేసేలా కష్టపడతామని బిజెపి...
By Boya Dasthagiri 2026-08-08 14:28:21 0 192
Telangana
నేడే పదవ తరగతి ఫలితాలు
న్యూస్ (భారత్ ఆవాజ్ ) నేడే పదవ తరగతి ఫలితాలు మధ్యానం 2 గంటలకు విడుదల ప్రకటించిన బోర్డు 
By Midathapalli Kiran Kumar 2026-04-29 07:06:29 0 626
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com