గ్రామీణ జర్నలిస్టులకు అండగా TUWJ(IJU)

0
789

  గంగారంలో భారీగా సభ్యత్వ నమోదు                                                                                                       
మహబూబాబాద్/గంగారం,::: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) – ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం బుధవారం ఉత్సాహంగా ప్రారంభమైంది. మండలంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి TUWJ సభ్యత్వం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి TUWJ వేదిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి TUWJ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గాడిపెళ్లి శ్రీహరి, స్టేట్ కౌన్సిలు సభ్యులు శ్రీనివాస్  హాజరై సభ్యత్వ నమోదును ప్రారంభించారు. "జర్నలిస్టుల హక్కుల కోసం, సంక్షేమం కోసం TUWJ నిరంతరం పోరాడుతుంది. ఐజేయూ దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద జర్నలిస్టు సంఘం. దీని ద్వారా మన గొంతు ఢిల్లీ వరకు వినిపిస్తుంది" అని వారు పేర్కొన్నారు. మండల జర్నలిస్టులు మాట్లాడుతూ, "మారుమూల మండలమైన మాకు ఒక బలమైన యూనియన్ అండ అవసరం. అక్రిడిటేషన్, హెల్త్ కార్డు, ఇన్సూరెన్స్, వేధింపుల నుండి రక్షణ వంటి సమస్యలపై TUWJ అండగా నిలుస్తుందనే నమ్మకంతో సభ్యత్వం తీసుకుంటున్నాం" అని తెలిపారు. మండలంలో 100% అర్హులైన జర్నలిస్టులను TUWJలో చేర్పించడమే లక్ష్యమని TUWJ మండల అధ్యక్షులు బుర్కా యాదగిరి అన్నగారు తెలిపారు. త్వరలో సభ్యత్వం నమోదు కంప్లీట్ చేసి  సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. "జర్నలిస్టుపై దాడి జరిగితే అది ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తాం. ప్రతి సభ్యుడికి TUWJ అండగా ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి జర్నలిస్టుకు అందేలా చూస్తాం" అని జిల్లా నాయకులు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో IJU సహాయ కార్యదర్శి రావుల ప్రశాంత్, గూడూరు,  కొత్తగూడ, యాకంబ్రం, సల్మాన్, వెంకటేష్, కర్ణాకర్ రెడ్డి, అశోక్, భరత్, దేవేందర్, శ్రీధర్, సంతోష్, శేఖర్, రవీందర్, ఎస్కే లతీఫ్, భార్గవ్, సురేష్, ముత్తయ్య,
తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అసెంబ్లీని కొడవలివారిపాలెం విద్యార్థులు పర్చూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఏలూరితో ముచ్చట్లు...
పర్చూరు: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని కొడవలివారిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్‌కు...
By Gadiyapudi Narendra 2026-03-05 18:11:41 0 752
Andhra Pradesh
ఎమ్మిగనూరులోని ఆర్&బీ అతిథి గృహంలో నిర్వహించిన
ఎమ్మిగనూరులోని ఆర్&బీ అతిథి గృహంలో నిర్వహించిన అంగన్‌వాడీ కార్యకర్తలకు నూతన ఇండక్షన్...
By Chennaiah Kati 2026-07-24 07:45:54 0 220
Andhra Pradesh
మదనపల్లి: నా బిడ్డకు ప్రాణపరిచి పెట్టండి.
అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పోతబోలు గ్రామానికి చెందిన నిశాంత్ కుమార్ అనే బాలుడు లివర్...
By Pagadala Venkateswar 2026-02-06 04:43:05 0 183
Punjab
Punjab Launches Global Training Drive to Transform School Education
Chandigarh: Determined to create a world-class learning environment, the Bhagwant Singh Mann...
By BMA ADMIN 2025-05-20 07:53:40 0 2K
Telangana
గాదే ఇన్నారెడ్డి అరెస్ట్.|
     హైదరాబాద్ :  మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు అరెస్ట్...
By Sidhu Maroju 2025-12-21 11:54:18 0 243
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com