మోతుకుల కుంట ఔట్‌లెట్ నాలాలో కలకలం.|

0
118

"పూడిక తీయగా బయటపడిన గుర్తుతెలియని మృతదేహం"

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ మండలం మచ్చబొల్లారంలోని మోతుకుల కుంట ఔట్‌లెట్ నాలాలో పూడిక తొలగింపు పనులు చేపడుతున్న హైడ్రా సిబ్బందికి గుర్తుతెలియని మృతదేహం బయటపడటంతో స్థానికంగా కలకలం రేగింది.

హైడ్రా సిబ్బంది వెంటనే అల్వాల్ పోలీసులకు సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

ప్రాథమిక పరిశీలనలో మృతదేహం సుమారు 15 రోజుల క్రితం నాటిదై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

వివరాలు ఇంకా తెలియరాలేదని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, గుర్తింపు కోసం చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ అమరావతిని రాజధానిగా ఖరారు
అందరికీ నమస్కారం.   ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో చట్టబద్ధత...
By Rajini Kumari 2026-04-02 16:02:40 0 197
Telangana
ఒకప్పటి స్టార్ ఆఫీసర్లకు ఏమైంది? తెలంగాణలో #స్మితాసబర్వాల్...ఏపీలో #ఆమ్రపాలి
తెలుగు రాష్ట్రాల అధికార యంత్రాంగంలో ఒకప్పుడు తమదైన మార్కుతో దూసుకెళ్లిన ఐఏఎస్ అధికారులు వారు....
By Ponnala Srinivasrao 2026-08-09 01:42:45 0 144
SURAKSHA
Guardian of the Coast: Puducherry’s Maritime Security
Puducherry’s strategic coastal geography necessitates a vigilant approach to maritime...
By Lokeshwari Panthadi 2026-07-03 08:30:03 0 148
Andhra Pradesh
ఆగిరిపల్లి పోతవరప్పాడు లో పేకాట శిబిరంపై పోలీసుల ఆకస్మిక దాడులు
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులో పేకాట శిబిరంపై పోలీసుల ఆకస్మిక దాడులు...  ...
By Rajini Kumari 2025-12-22 08:08:29 2 987
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com