'వైద్య నారాయణో హరి'.. డాక్టర్ల సేవలు అమూల్యం: ఈటల.|

0
237

"డాక్టర్స్ డే వేడుకల్లో వైద్యులకు సన్మానం"

మేడ్చల్ మల్కాజిగిరి: డాక్టర్ల సేవలు అమూల్యమైనవని, అందుకే వారిని "వైద్య నారాయణో హరి" అంటూ భగవంతునితో పోలుస్తారని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు.

డాక్టర్స్ డే సందర్భంగా వనస్థలిపురంలోని లక్ష్మి హాస్పిటల్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రీహాబిలిటేషన్ వార్డును ప్రారంభించారు. 

అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురికి అవార్డులు అందజేసి, వైద్యులను సన్మానించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన వైద్యులు, వైద్య సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యం చెప్పడంతో పాటు వైద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసిన సందర్భాలను ఆయన గుర్తు చేశారు.

డాక్టర్లు ఎంత ఒత్తిడి ఉన్నా ఓర్పుతో ప్రజలకు సేవలందిస్తారని, వారి సేవలకు సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొంటూ, డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి, లచ్చిరెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి, రాణా ప్రతాప్, డాక్టర్లు శ్రీకాంత్, శ్వేత, వంశీ, సృజన తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
SURAKSHA
Shekhar Kuriakose, IAS: Leading Climate-Resilient Governance
The Journey Begins "Preparing for disasters before they happen is the most effective form of...
By Fathima Safa 2026-07-15 11:24:25 0 150
Telangana
డాక్టర్ దందా.. పోలీసుల పంజా.|
● సూరారం–ఎస్‌వోటీ కుత్బుల్లాపూర్ సంయుక్త ఆపరేషన్ ● వైద్య అర్హతలు, లైసెన్స్ లేకుండానే...
By Sidhu Maroju 2026-08-01 09:36:27 0 157
Andhra Pradesh
Pawan Kalyan: తిరుమల లడ్డూ వ్యవహారంలో సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదు: పవన్ కల్యాణ్.
గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యికి...
By Pagadala Venkateswar 2026-02-06 05:06:19 0 209
Telangana
సింగరేణికి పూర్వ వైభవం తీసుకొస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా, మే 14: సింగరేణి కార్మికులతో కాకా కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు...
By Avunoori Mahesh 2026-05-14 06:09:11 0 211
Andhra Pradesh
పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,...
By Pagadala Venkateswar 2026-09-02 09:25:43 0 86
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com