KGBV పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ కామ్లే అనిల్ కుమార్

0
275

🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్డె అనిల్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, భోజన నాణ్యతను పరిశీలించిన అనంతరం వారికి బెడ్ షీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ, ప్రతి విద్యార్థిని కష్టపడి చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కష్టపడి చదివే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని, రానున్న రోజుల్లో విద్యార్థులందరికీ  స్టూడెంట్ కిట్స్ అందజేస్తామని తెలియజేశారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులందరికీ ప్రభుత్వం తరఫున ఉచితంగా నీట్ (NEET), ఐఐటీ (IIT) కోచింగ్ ఇప్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో సీట్లు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శివచరణ్, ఎస్ఓ రైషా గారు, పాఠశాల సిబ్బంది, మండల పార్టీ అధ్యక్షులు నారాయణ, సర్పంచ్ కృష్ణాజీ, మేషుజీ మరియు ఇతర ముఖ్య నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శవ రాజకీయాలు కోసమే జగన్ విశాఖ వస్తున్నారు: VZM MP
శవ రాజకీయాలు కోసమే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనకు వస్తున్నారని విజయనగరం MP కలిశెట్టి...
By Boiena Rajesh 2026-06-10 09:51:54 0 226
Andhra Pradesh
మన్యం, విజయనగరం జిల్లాలకు Yellow Alert
రాబోయే మూడు గంటల్లో పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై, చెదురుమదురుగా...
By Boiena Rajesh 2026-06-18 05:15:07 0 200
Andhra Pradesh
మున్సిపల్ వార్డుల పునర్విభజన గడువు పెంపు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.
ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి...
By Pagadala Venkateswar 2026-04-08 06:03:02 0 223
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గం:లో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం పుంగనూరు...
By Kothuru Murali 2026-02-16 11:26:14 0 217
Andhra Pradesh
బాపట్ల జిల్లాలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు* *ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శక్తి స్టాల్*
ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 5 శక్తి బృందాలు నిరంతరం...
By Vadlamudi NagaVenkat 2026-03-08 15:37:45 0 968
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com