11వ వార్డు వర్ష బాధితులకు కౌన్సిలర్ కార్తీక్ అండ

0
255

🎤కొమురం భీం భారత్ ఆవాజ్, ప్రతినిధి జగదీష్

నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఓ పేద కుటుంబం ఇంట్లోపలికి వర్షపు నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే 11వ వార్డు కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ గారు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారి పరిస్థితిని చూసి చలించిన ఆయన, తక్షణమే స్పందించి సమస్యను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించేందుకు తన వంతు పూర్తి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, హౌసింగ్ ఏఈ తో మాట్లాడి వారిని వెంటనే సంఘటనా స్థలానికి రప్పించారు. కౌన్సిలర్ కార్తీక్ గారితో కలిసి అధికారి ఆ ఇంటిని పరిశీలించారు. అనంతరం అధికారులు మాట్లాడుతు. అర్హత ప్రమాణాల మేరకు బాధిత కుటుంబానికి త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు అందేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విపత్కర సమయంలో వేగంగా స్పందించి తమకు అండగా నిలిచిన కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Chhattisgarh
Chhattisgarh's Krishak Unnati Yojana Boosts Rural Economy
Agriculture continues to anchor Chhattisgarh’s economic strategy, underscored by the robust...
By Lokeshwari Panthadi 2026-06-26 12:14:08 0 133
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:కేతనపల్లెలో మామిడి తోటలో చెలరేగిన మంటలు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం కేతనపల్లె గ్రామ సమీపంలో మామిడి తోటలో ఆదివారం మధ్యాహ్నం...
By Kothuru Murali 2026-02-23 12:00:01 0 181
Andhra Pradesh
ఏప్రిల్ 11న జ్యోతీరావ్ ఫులె జయంతి నిర్వహణ
ప్రభుత్వ ఆదేశాల మేరకు మహాత్మ జ్యోతిరావు ఫులె 200వ జయంతి కార్యక్రమాన్ని ఏప్రిల్ 11న ఉదయం 10 గంటలకు...
By Boiena Rajesh 2026-04-10 01:02:38 0 189
Andhra Pradesh
ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి కొండపల్లి
గాజులరేగ కొండపై పోలీసు వాహనం బోల్తాపడిన ఘటనలో గాయపడిన పోలీసు సిబ్బందిని మంత్రి కొండపల్లి...
By Boiena Rajesh 2026-08-23 13:08:33 0 100
Andhra Pradesh
పొట్టి శ్రీరాములు త్యాగాన్ని మరువలేము- చీరాల వాకర్స్ అసోసియేషన్
చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుడు,గాంధేయవాది,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
By Vadlamudi NagaVenkat 2026-03-16 12:37:14 0 650
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com