విద్యార్థులతో వికసిత్ భారత్ దిశగా..|

0
193

"ఔషాపూర్ విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో మొక్కల నాటటం.. స్టూడెంట్స్ కాంక్లేవ్‌లో పాల్గొన్న నితిన్ నబీన్, రామచందర్ రావు, ఈటల రాజేందర్."

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఘట్‌కేసర్ మండలం ఔషాపూర్‌లోని విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. 

కళాశాల ప్రాంగణంలో వారు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

అనంతరం నిర్వహించిన 'వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాంక్లేవ్' కార్యక్రమంలో వారు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 

దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల ద్వారా అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. విద్యార్థులు తమ ప్రతిభను దేశ ప్రగతికి వినియోగించడంతో పాటు సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Telangana
గణేష్‌ మండపాల నిర్వాహకులతో పోలీసుల భేటీ.|
అల్వాల్, సెప్టెంబర్ 10: గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై...
By Sidhu Maroju 2026-09-10 15:49:37 0 107
Delhi - NCR
Parliament’s Both Houses Adjourned Amid Uproar
New Delhi: The proceedings of both the Lok Sabha and Rajya Sabha were adjourned today following...
By BMA ADMIN 2025-08-11 11:21:30 0 2K
Andhra Pradesh
సెమీకండక్టర్ల తయారీకి ఏపీనే బెస్ట్ డెస్టినేషన్: సీఎం చంద్రబాబు.
  సెమీకండక్టర్ల తయారీకి ఏపీనే బెస్ట్ డెస్టినేషన్: సీఎం చంద్రబాబు 16-06-2026 Tue ...
By Pagadala Venkateswar 2026-06-16 13:17:37 0 96
Andhra Pradesh
Ambati Rambabu: గతంలో అంబటి రాంబాబు గారు అనే దాన్ని... ఇప్పుడు ఆ పదానికి అర్హుడు కాదు: హోంమంత్రి అనిత.
చంద్రబాబుపై వ్యాఖ్యలు.. అంబటిపై కేసు పెడతామని హెచ్చరించిన హోంమంత్రి అనిత   శాంతిభద్రతలకు...
By Pagadala Venkateswar 2026-02-01 08:40:22 0 184
Andhra Pradesh
పెద్దాపురంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం
పెద్దాపురం పట్టణంలో మహిళలు, బాలికల భద్రతపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు....
By Ratna Sekhar 2026-03-06 16:50:04 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com