నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు గట్టి కౌన్సిలింగ్ చేస్తున్న గుంటూరు పోలీసులు

0
93

నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు గట్టి కౌన్సిలింగ్ చేస్తున్న గుంటూరు పోలీసులు

గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ రోజు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు మరియు చెడు నడత కలిగిన వారికి పోలీసు అధికారులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి పూర్తిగా స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇటీవల ఒక రౌడీ షీటర్‌పై పీడీ యాక్ట్ అమలు చేసి రాజమండ్రి జైలుకు పంపించగా, బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించిన మరో రౌడీ షీటర్‌కు మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (ఎంఆర్వో) 15 రోజుల జైలు శిక్ష విధించారు.

రౌడీ షీటర్లు మరియు నేరప్రవృత్తి కలిగిన వ్యక్తులపై జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగుతోందని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

జిల్లా పోలీసు కార్యాలయం, గుంటూరు.

Search
Categories
Read More
Chandigarh
Chandigarh Mayoral Elections to be Held via Show-of-Hands Voting
Chandigarh’s municipal politics is taking a turn towards transparency. The upcoming mayoral...
By Bharat Aawaz 2025-07-17 05:51:34 0 1K
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో చికెన్ కొంటున్నారా జాగ్రత్త
జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో 176 నుంచి 180 వరకు...
By Benguluri Madhubabu 2026-06-28 12:28:56 0 158
SURAKSHA
K. Padmakumar IPS: A Visionary Leader in Modern Policing
The Journey Begins "A police officer's greatest strength is not authority alone—it is the...
By Fathima Safa 2026-07-16 06:46:15 0 216
Telangana
చిత్తారమ్మ జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యేను కలిసిన ఆలయ కమిటీ.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : - జీడిమెట్ల -132 డివిజన్ పెట్ బషీరాబాద్ లోని...
By Sidhu Maroju 2025-12-31 11:58:33 0 234
Telangana
జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ మరియు డిఇఓ లుపాఠశాలలు పరిశీలన
భూపాలపల్లి (భారత్ ఆవాజ్ న్యూస్): జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ బుధవారం భూపాలపల్లి మండలం...
By BURRA KIRANKUMARA 2026-09-16 09:00:01 0 132
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com